Niharika Konidela: నటి, నిర్మాత, మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రస్తుతం నిర్మాతగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. 2024లో ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని.. తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై.. నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి తాజాగా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రాకాస’ (Raakaasaa) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు, ఈ అప్డేట్‌లో చిత్ర విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- The Raja Saab: తెలంగాణ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా? ఇంకా ఓపెన్ కాని బుకింగ్స్!
మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా..
సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), నయన్ సారిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘రాకాస’ చిత్రానికి మానస శర్మ (Manasa Sharma) దర్శకత్వం వహిస్తున్నారు. ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంలో సోలో హీరోగా మెప్పించనున్నారు. ఆయన సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇది వరకు నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ మూవీలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తే.. మానస శర్మ ఆ చిత్రానికి రచయితగా వర్క్ చేశారు. ఆ సినిమా తర్వాత మానస శర్మ సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ5 బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘రాకాస’ చిత్రంతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.
Also Read- Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!
రిలీజ్ ఎప్పుడంటే..
టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల సందర్భంగా నిర్మాతలు నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. సంగీత్ శోభన్‌ను సోలో హీరోగా పరిచయం చేస్తూ మేం స్టార్ట్ చేసిన సినిమాకు ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. ఇదొక ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఇందులో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక సాంగ్, నాలుగు రోజుల టాకీ పార్ట్ మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. త్వరలోనే వాటిని కంప్లీట్ చేస్తాం. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 3న ఈ మూవీని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అనుదీప్ దేవ్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని అన్నారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, అన్నపూర్ణ, అమన్, అనూప్ సింగ్ ఠాకూర్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Born under the eclipse 🌑
Truth or Myth?
You’ll know soon..
Until then, stay curious.#Pep2 is now #RAAKAASAA 💥@IamNiharikaK #SangeethShobhan #NayanSarika #ManasaSharma #MaheshUppala @vennelakishore @AshishVid @getupsrinu3 #Bharani @anudeepdev @eduroluraju @anwaraliedit pic.twitter.com/4msR0g59S4— Pink Elephant Pictures (@PinkElephant_P) January 8, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

