Sobhita Dhulipala: నాగ చైతన్య (Naga Chaitanya) వైఫ్ శోభిత ధూళిపాల (Sobhita Dhulipala) ‘చీకటిలో’ (Cheekatilo) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘చీకటిలో’ శోభిత ఏం చేసింది? అసలేంటి ఈ ‘చీకటిలో’ కథ అనుకుంటున్నారా? ‘చీకటిలో’ అనేది హైదరాబాద్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న క్రైమ్ సస్పెన్స్ ఫిల్మ్. సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్ చుట్టూ తిరిగే ఈ సినిమా కథలో సంధ్యగా శోభిత ధూళిపాల నటించారు. శోభిత ధూళిపాల ఇప్పటికే తెలుగుతో పాటు కొన్ని బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. నటిగానే నాగ చైతన్యకు ఆమె పరిచయమైంది. ఆ తర్వాత వారి మధ్య ప్రేమ పుట్టడం, అది పెళ్లి వరకు వెళ్లడం జరిగింది. లాస్ట్ ఇయర్ వీరిద్దరూ పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాత కూడా శోభిత ధూళిపాల నటిస్తూనే ఉంది. ఇప్పుడామె నటించిన ఈ ‘చీకటిలో’ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాకపోతే ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే..
Also Read- Seetha Payanam: ‘అస్సలు సినిమా’ ముందుందంటోన్న అర్జున్ కుమార్తె..
సంధ్య పాత్రలో శోభిత ధూళిపాల
శోభిత ధూళిపాల నటించిన ‘చీకటిలో’ చిత్రం థియేటర్లలోకి రావడం లేదు. డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రైమ్ వీడియో ఒరిజినల్ తెలుగు సినిమాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జనవరి 23న ప్రీమియర్ కాబోతున్నట్లుగా ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇందులో సంధ్య పాత్రలో శోభిత ధూళిపాల.. నగరములో జరిగే కొన్ని దారుణమైన చీకటి రహస్యాలను వెలికితీస్తుంది. అవేంటో తెలియాలంటే మాత్రం జనవరి 23 వరకు వెయిట్ చేయాల్సిందే. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్‌పై డి. సురేష్ బాబు నిర్మించారు. చంద్ర పెమ్మరాజు రచనా సహకారం అందించారు. శోభిత ధూళిపాలతో పాటు విశ్వదేవ్ రాచకొండ ఇందులో మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. చైతన్య, విశాలక్ష్మి, ఈషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇందులో సంధ్య అనే ట్రూ క్రైమ్ పాడ్కాస్టర్, తన వద్ద శిక్షణ పొందుతున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. అతని మృతికి న్యాయం చేయాలని అలుపెరగని ప్రయత్నము చేసే క్రమంలో.. దారుణమైన నేరాల గురించి కనిపెడుతుంది. ఇదే మెయిన్ ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని ప్రైమ్ టీమ్ తెలుపుతోంది.
Also Read- Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!
ఎమోషన్స్‌తో నిండిన సస్పెన్స్ డ్రామా
ఈ సినిమా విడుదల సందర్భంగా నిర్మాత డి. సురేష్ బాబు (D Suresh Babu) మాట్లాడుతూ.. ‘చీకటిలో’ అనేది ఎమోషన్స్‌తో నిండిన సస్పెన్స్ డ్రామా. చీకటిని ఎదుర్కోవడానికి, నిజాలు మాట్లాడటానికి కావలసిన ధైర్యాన్ని ఈ సినిమా అన్వేషిస్తుంది. ప్రస్తుత సమాజములో ఇలాంటి సినిమాలు మనకెంతో అవసరం. అమెజాన్ ఒరిజినల్ కోసం ప్రైమ్ వీడియో (Prime Video)తో కలిసి పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా దీర్ఘకాలంగా కొనసాగుతున్న మా భాగస్వామ్యములో మరొక మైలురాయి అని చెప్పగలను. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కట్టిపడేసే ఇలాంటి పాత్రలతో, ఇంట్రస్టింగ్ కథనాలకు దోహదపడాలనే మా విజన్‌ను పంచుకుంటాము. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఎంగేజ్ చేసేలా, అదే టైమ్‌లో అవగాహన కల్పించేలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెజాన్ ప్రైమ్ వీక్షకులు జనవరి 23న ప్రీమియర్ కాబోతున్న ఈ సినిమా చూసి ఆనందిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

