Seetha Payanam: ‘ఇన్‌ఫ్రంట్ థేర్ ఈజ్ క్రొకోడైల్ ఫెస్టివల్’ అని చిరంజీవి అంటే, ‘అస్సలు సినిమా’ ముందుంది అంటుంది యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్. ఏం అర్థం కాలేదా? అసలు విషయంలోకి వస్తే.. మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ (Action King Arjun) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న నూతన చిత్రం ‘సీతా పయనం’ (Seetha Payanam). శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) ప్రధాన పాత్రలో నటించగా.. నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారు. అర్జున్ మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ ఇందులో పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే..
Also Read- Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు
‘అస్సలు సినిమా’ వెనుకున్న విషయం ఏమిటంటే..
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్‌తో మొదలైన ఈ సినిమా నుంచి.. సడెన్‌గా అతను తప్పుకోవడంతో.. మరో హీరోతో అర్జున్ ఎంతో ప్రెస్టీజీయస్‌గా తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి ఏం అప్డేట్ వచ్చినా, అది వార్తలలో నిలుస్తూ వస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా’ అనే సాంగ్‌ని రిలీజ్ చేశారు. అది ‘అస్సలు సినిమా’ (Assalu Cinema) వెనుక ఉన్న విషయం. ఇక ఈ పాట విషయానికి వస్తే..
Also Read- Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!
ఆస్కార్ విజేత లిరిక్స్..
‘ఆహా ఓహో అంటాడు.. అందం నీదే అంటాడు’ అనే పదాలతో మొదలైన ఈ సాంగ్‌లో పెళ్లిసందడితో కోలాహలంగా ఉంది. పెళ్లి తర్వాత ‘అస్సలు సినిమా’ ఉంటుందనేలా.. ఊపు తెప్పించే లిరిక్స్‌తో ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్రేయ ఘోషల్ పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ అందాలు, డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్ అవుతుండగా.. అనూప్ రూబెన్స్ బాణీలు ఆకట్టుకునేలా ఉన్నాయి. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్ కావడమే గాక, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తూ.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణుల బృందం పని చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ వరసగా ఇస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తామని చిత్రయూనిట్ చెబుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

