Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో
MSG Pre Release Event (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో రాబోతున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu). ఇందులో విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కీలక పాత్రతో నటించిన విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్ శిల్పాకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..

సంక్రాంతి మనదే

సంక్రాంతి మనదే అంటే.. నా ఒక్కడిదో లేదంటే మా సినిమాది మాత్రమే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానిది. మా సినిమాతో పాటు డార్లింగ్ ప్రభాస్ ‘రాజా సాబ్’, నా తమ్ముడు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, మా ఇంట్లో పిల్లాడుగా పెరిగిన శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, నన్ను గురువుగా భావించే శిష్యుడు నవీన్ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ సినిమాలన్నీ పెద్ద హిట్ అవ్వాలి. ఈ సంక్రాంతి ఈ సినిమాలన్నింటిది. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాల విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అందరూ సుభిక్షం ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి. అది ప్రేక్షకులు ఇస్తారనే నమ్మకం నాకయితే ఉంది. 2026 సంక్రాంతిని తెలుగు పరిశ్రమ మరిచిపోకూడదు. అన్ని సినిమాలకు థియేటర్లకు వెళ్లి, విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

Also Read- Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!

రాఘవేంద్రరావు కోరుకున్నారు

కొన్నాళ్ల క్రితం అనిల్ రావిపూడి గురించి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చెప్పారు. మా ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే చాలా బాగుంటుందని ఆయన కోరుకున్నారు. ఆయన మనసులో మాట ఇది. ఆయనే ఈ సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఆయనతో చేసిన ‘ఘరానా మొగుడు’ సినిమా ఎలా అయితే విజయం సాధించిందో.. ఈ సినిమా కూడా అలాంటి విజయాన్నే అందుకుంటుందని ఎన్నోసార్లు నాతో చెబుతూ ఉన్నారు.

అనిల్ రావిపూడి అలా వద్దన్నాడు

‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత అనిల్ రావిపూడి వచ్చి ఓ మంచి కథ వినిపించాడు. నేను కూడా అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పా. కానీ వద్దండి.. మీరు మీ ఓల్డ్ సినిమాలో చేసినట్లుగా చేస్తే చాలు. మాలాంటి వారందరికీ మీరు, మీ నటన తెలుసు. ఇప్పుడొచ్చే వాళ్లకు అప్పటి మీ నటనను పరిచయం చేద్దాం అని అనగానే ఓకే చెప్పాను. నేను చేసిన సినిమాలలోని సీన్లను ఫోన్‌లో తెచ్చి చూపించి, ఇలా చేయాలని నాతో చేయించేవారు. అతనితో ఈ సినిమాకు పని చేయడం మంచి ఎక్స్‌పీరియెన్స్. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాను. ఏదైనా ఒక సినిమా షూటింగ్ అయిపోతే హమ్మయ్య అనుకుంటాం. కానీ, ఈ సినిమాకు ఆఖరి రోజు.. మాత్రం కాలేజ్ అయిపోయే వెళ్లే విద్యార్థిగా ఫీలయ్యాను. అలాంటి ఎమోషన్ నాకు ఎప్పుడూ రాలేదు. అనిల్‌ని అడిగితే, తను కూడా అదే చెప్పాడు. సెట్‌లో ఎప్పుడూ ఆనందమైన వాతావరణం ఉండేది. ఇలాంటి డైరెక్టర్ దొరికితే ఏ పాత్ర అయినా కేక్ వాక్‌లా చేసేయగలరు. ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఎలా అంటే బడ్జెట్ పరంగా. అనుకున్నదానికంటే తక్కువ రోజుల్లో, బడ్జెట్ దాటకుండా అనుకున్న టైమ్‌కి రెడీ చేశాడు. రెండో విజయం 12 తారీఖున ఎంత ఘన విజయం ఇస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారు.

Also Read- Varunavi: మెగాస్టార్ మాటిచ్చారు.. సరిగమప లిటిల్ చాంప్స్ వరుణవికి చిరు ఆశీస్సులు

వెంకీతో ఫుల్ లెంత్ సినిమా చేసేందుకు రెడీ..

నా తమ్ముడు వెంకటేష్‌తో సినిమా చేయడం అనేది చాలా ఎక్జయిటింగ్ విషయం. వెంకటేష్ చాలా పాజిటివ్ పర్సన్. తనతో కూర్చుంటే ఫిలాసఫికల్‌గా అనిపిస్తుంది. మోడరన్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువు లాగా అనిపిస్తుంటాడు. తనతో మాట్లాడుతుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఈ సినిమాలోకి వెంకీ ఎలా వచ్చాడంటే.. మేము చాలా సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టిల్ ఫోటో దిగడం జరిగింది. మనిద్దరం కలిసి ఇలాంటి ఒక సినిమా చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. అనిల్ ద్వారా ఇన్నాళ్లకు అది కుదిరింది. అనిల్ రావిపూడి మాత్రమే దానికి జస్టిఫికేషన్ చేయగలిగాడు. మా కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరు థియేటర్స్‌లో ఎంజాయ్ చేయండి. మేమిద్దం మాత్రం చాలా ఎంజాయ్ చేశాం. ఇది యాక్టింగ్ చేసినట్లు ఉండదు. ఇద్దరు కుర్రాళ్ళు కలిసి అల్లరి చేసినట్టుగా అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకి పూర్తిస్థాయి న్యాయం చేసి మరో సినిమాని నెక్స్ట్ తీసుకెళ్లడానికి దోహదపడిన వెంకటేష్‌కి మనస్ఫూర్తిగా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి మేము ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎంత ఊహించుకున్న తక్కువే అవుతుంది. అనిల్ మాట్లాడుతూ మనిద్దరం ఫుల్ లెంత్‌లో ఒక సినిమా చేస్తే బాగుంటుందన్నారు. అలాంటి ఒక కథ రాసుకుంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే