Chiru – Venky: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రం ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకోగా, బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను (MSG Pre Release Event) గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు భీమ్స్, హీరోయిన్ నయనతార మినహా.. మ్యాగ్జిమమ్ ఈ చిత్రానికి పని చేసిన వారంతా హాజరయ్యారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఎంట్రీ అదిరిపోయింది. వారిద్దరూ చేతులు పట్టుకుని వేడుకకు రావడంతో అందరూ ఒక్కసారిగా లేచి, క్లాప్స్‌తో హోరెత్తించారు. నిజంగా ఇలాంటి మాస్ ఎంట్రీని ఎవరూ ఊహించి ఉండరు.
Also Read- Varunavi: మెగాస్టార్ మాటిచ్చారు.. సరిగమప లిటిల్ చాంప్స్ వరుణవికి చిరు ఆశీస్సులు
ఎటువంటి బేషజాలు లేకుండా..
ఇద్దరు స్టార్ హీరోలు సినిమా చేస్తున్నారంటే.. చాలా వరకు ఈగోలు ఉంటాయి. ఆర్ఆర్ఆర్ విషయంలో ఇంకా సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇప్పటికీ ఫ్యాన్స్ కొట్టుకుంటూనే ఉంటారు. కానీ ఎటువంటి బేషజాలు లేకుండా చిరు, వెంకీ అన్నదమ్ముల్లా, ప్రాణ స్నేహితుల్లా మొదటి నుంచి ఉంటూ వచ్చారు. ఆ స్నేహం, బంధాన్ని ఈ వేడుకలో మరోసారి చూపించారు. ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ వచ్చినప్పుడే ఇద్దరి స్నేహం గురించి అంతా మాట్లాడుకున్నారు. ఒకరికి ఒకరు కళ్లజోడు పెట్టడం, కలిసి స్టెప్పులేయడం నిజంగా చాలా గొప్ప విషయనే చెప్పాలి. ఇలాంటి స్నేహపూరిత వాతావరణమే నేడు ఇండస్ట్రీలో కొరవడింది. ఫ్యాన్ వార్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. ఇలా హీరోలందరూ కలిసి కనిపిస్తేనే తప్ప.. లేదంటే అవి మరింతగా ముదిరే అవకాశం లేకపోలేదు.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షో టికెట్ ధర వింటే షాకే!
వారే స్పెషల్ ఎట్రాక్షన్
ఇక చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ ఈ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. డ్యాన్సర్స్‌తో కలిసి డ్యాన్సులు చేశారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకుంటూ కనిపించడం, కలిసి డ్యాన్స్ చేయడం, ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం.. ఇవన్నీ చూసి ఇద్దరు హీరోల అభిమానులకు కడుపు నిండిపోయిందంటే అతిశయోక్తి కానే కాదు. ప్రస్తుతం వారి ఎంట్రీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరు హీరోల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని షైన్ స్ర్కీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

