The Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏపీలో సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడం నిర్మాతలకు చాలా ఈజీ అయిన విషయం తెలిసిందే. ఇలా అడిగితే చాలు.. అలా పర్మిషన్ వచ్చేస్తుంది. ఆఖరికి డబ్బింగ్ సినిమాలకు కూడా టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటుని ఏపీ ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక ‘రాజా సాబ్’ విషయానికి వస్తే.. తెలంగాణలో ఇంకా ఎంత పెంచుతారనే విషయం తెలియదు కానీ, ఏపీలో మాత్రం బెనిఫిట్ షోతో పాటు, 10 రోజుల పాటు సింగిల్ స్ర్కీన్, మల్టీప్టెక్స్ థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుకునేందుకు వెసులు బాటును కల్పిస్తున్న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం..
ఏపీ ఇచ్చిన జీవోలో ఏముందంటే..
ఏపీలో జనవరి 8న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్యలో బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతి ఇస్తూ.. టికెట్ ధరను రూ. 1000 రూపాయలు ఉండేలా అనుమతి వచ్చింది. ‘ది రాజా సాబ్’ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ జనవరి 9 అనే విషయం తెలిసిందే. కానీ ఒక రోజు ముందే ఈ సినిమాను చూడాలంటే మాత్రం రూ. 1000 సమర్పించుకోవాల్సిందే. ఇంకా జనవరి 9 నుంచి రోజుకు 5 షోలకు అనుమతి ఇస్తూ 10 రోజుల పాటు సింగిల్ స్ర్కీన్స్‌లో టికెట్ ధరపై రూ. 150, మల్టీప్లెక్స్‌లలో రూ. 200 పెంచుకునేందుకు అనుమతిని ఏపీ ప్రభుత్వం ‘ది రాజా సాబ్’ టీమ్‌కు ఇచ్చింది. దీంతో ‘రాజా సాబ్’ టీమ్, ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ‘బెనిఫిట్ షో’ టికెట్ ధర చూసి.. అమ్మో అంతా అంటూ షాకవుతున్నారు. మరోవైపు సంక్రాంతి పండుగకు అందరినీ థియేటర్లకు రప్పించాలంటే టికెట్ల ధరలను పెంచుకుండా ఉండటమే బెటర్ అనేలా కూడా కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.
Also Read- BMW Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ ఎలా ఉందంటే..
తెలంగాణలోనూ పెరగనున్నాయి
మరోవైపు తెలంగాణ (Telangana) విషయంలో ‘ది రాజా సాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ టీమ్ ఇదే విషయమై కోర్టును ఆశ్రయించగా, టికెట్ల ధరలను పెంచుకునేలా సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన హైకోర్టు ఆదేశించింది. ఎప్పుడూ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత గొడవలు అవడం, వెంటనే కోర్టు కలగజేసుకుని మొట్టికాయలు వేయడం, ప్రభుత్వం జీవోని వెనక్కి తీసుకోవడం వంటివి జరుగుతున్న క్రమంలో.. ఈసారి నిర్మాతలు డైరెక్ట్‌గా కోర్టునే ఆశ్రయించారు. కోర్టు నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చింది కాబట్టి.. తెలంగాణలోనూ ఈ సంక్రాంతికి సినిమాలకు టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది. ఇంకొన్ని గంటల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా జీవో విడుదలకానుందనేలా టాక్ నడుస్తుంది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

