VicKat: బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా కైఫ్ (Katrina Kaif)లకు ఇటీవల ఓ బాబు జన్మించిన విషయం తెలిసిందే. బాబు పుట్టినట్లుగా ఓ పోస్ట్ చేశారు తప్పితే.. ఆ తర్వాత ఎటువంటి పిక్‌ని వారు రిలీజ్ చేయలేదు. టాలీవుడ్‌లో రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఎలా అయితే తమ కుమార్తె ఫేస్ రివీల్ చేయకుండా దాస్తున్నారో.. అలాగే కత్రినా, విక్కీ కూడా నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు కూడా బిడ్డ ఫొటో షేర్ చేయలేదు కానీ, వాళ్లకు పుట్టిన బిడ్డకు పేరు పెట్టినట్లుగా చెబుతూ.. చిన్న గ్లింప్స్ పిక్ ఒకటి వదిలారు. ఈ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ స్టార్ కపుల్ తమ బిడ్డకు ఏం పేరు పెట్టారో తెలుసా? ఆ విషయంలోకి వెళితే..
Also Read- BMW Trailer: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ ఎలా ఉందంటే..
విక్కీ, కత్రినాల బిడ్డ పేరేంటంటే..
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ మొదటి బిడ్డకు విహాన్ కౌశల్ (Vihaan Kaushal) అనే పేరును పెట్టారు. ఈ విషయం ఇన్‌స్టా వేదికగా కత్రినా కైఫ్ తెలియజేసింది. పేరుతో పాటు చిన్న పిక్ కూడా ఆమె షేర్ చేశారు. ‘‘మా ప్రార్థనలు ఫలించాయి. జీవితం ఎంతో అందంగా ఉంది. ఒకే ఒక్క క్షణంలో మా ప్రపంచమే మారిపోయింది. మా మనసులోని భావాలను చెప్పడానికి ప్రస్తుతం మాటలు సరిపోవు’’ అని చెబుతూ.. కత్రినా, విక్కీ, విహాన్‌లు ఒకరి చేతిలో ఒకరు చేయి పెట్టుకున్నట్లుగా ఉన్న పిక్‌ని విడుదల చేశారు. కత్రినా చేసిన ఈ పోస్ట్‌కు హృతిక్ రోషన్, దియా మిర్జా, అదితిరావు హైదరి, భూమి పడ్నేకర్, పరిణితీ చోప్రా వంటి వారంతా లిటిల్ బుడ్డీకి వెల్‌కమ్ చెబుతూ.. కత్రినా, విక్కీ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కత్రినా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ వైరల్‌గా దూసుకెళుతోంది.
Also Read- Kalyan Padala: అరె ఏంట్రా ఇది.. స్టార్ హీరోకు కూడా ఇంత సెక్యూరిటీ ఉండదుగా!
మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తూ..
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల విషయానికి వస్తే.. వీరిద్దరూ 9 డిసెంబర్ 2021లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా’లో అత్యంత వైభవంగా, సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను పెళ్లి వరకు చాలా గోప్యంగా ఉంచారు. పెళ్లికి ముందు ప్రతి ఫంక్షన్‌లో ఇద్దరూ కలిసే కనిపించడంతో అందరికీ అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పెళ్లి చేసుకుని, హాయిగా జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. వారికి 7 నవంబర్ 2025న బాబు పుట్టినట్లుగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఇప్పుడా బాబుకు పేరు పెట్టి, తమ ఆనందాన్ని ఈ రూపంలో తెలియజేశారు. ఇద్దరూ యాక్టర్స్‌గా ఉంటూనే సొంతంగా బిజినెస్‌లు కూడా రన్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ బిడ్డ పుట్టిన తర్వాత కూడా సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి.. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ప్రస్తుతానికైతే ఆమె మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తాజాగా ఆమె చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

