Kalyan Padala: ఇప్పటి వరకు బిగ్ బాస్ షో విజయవంతంగా 9 సీజన్స్‌ను ముగించుకుంది. 9వ సీజన్‌లో విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలవగా, రెండో స్థానాన్ని తనూజ సొంతం చేసుకుంది. 9వ సీజన్ (Bigg Boss Telugu Season 9) గెలిచి విన్నర్‌గా బయటకు వచ్చిన కళ్యాణ్ పడాల (Kalyan Padala) రాజయోగం అనుభవిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా రాయల్‌గా ట్రీట్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఇంకా చెప్పాలంటే స్టార్ హీరో రేంజ్‌లో ఆయనకు జనాలు నీరాజనాలు పడుతున్నారు. మరి నిజంగా జనాలే వస్తున్నారా? లేదంటే అది కూడా పెయిడ్ బ్యాచా? అనేది తెలియదు కానీ, హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ వేషధారణ పూర్తిగా మారిపోయింది. ఒక స్టార్ హీరో రేంజ్‌లో కార్లు మీద నిలబడటం, కాళ్లు మొక్కించుకోవడం వంటివి చాలానే జరుగుతున్నాయి. అవన్నీ చూస్తే.. అరె ఏంట్రా ఇది? అని అనకుండా ఒక్కరు కూడా ఉండరు. ఆ రేంజ్ బిల్డప్‌తో కళ్యాణ్ పడాల తనపై అందరి కళ్లు పడేలా చూసుకుంటున్నాడు.
Also Read- First Ticket: పవన్ కళ్యాణ్, బాలయ్య రూ. 5 లక్షలు.. చిరు సినిమాకు ఇంత తక్కువా?
స్టార్ హీరో రేంజ్‌లో సెక్యూరిటీ..
వాస్తవానికి ఆయన బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే.. నెక్ట్స్ సినిమాల్లోకే అని చాలా సార్లు చెప్పాడు. శివాజీ (Sivaji)తో జరిగిన బిగ్ బాస్ బజ్‌లో కూడా మంచి నటుడిగా పది కాలాల పాటు గుర్తిండిపోయే పాత్రలు చేయాలని ఉందంటూ మనసులోని మాట బయటపెట్టాడు. దాని కోసం చాలా అంటే చాలానే ప్రయత్నిస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన ఎక్కడికి వెళ్లినా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. గన్‌లు ఒక్కటే తక్కువు.. స్టార్ హీరోలకు, రాజకీయ నాయకులకు ఉండే అన్ని రకాల సెక్యూరిటీని ఆయన ఏరేంజ్ చేసుకున్నారు. తాజాగా కళ్యాణ్ ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కళ్యాణ్ అతి చూస్తే.. కచ్చితంగా ఆయన ఫ్యాన్స్ కూడా.. బాబోయ్ ఇంత ఓవరాక్షన్ అవసరమా? అని అనుకుంటారు.
Also Read- Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?
ఇంత కరువులో ఉన్నారేంట్రా..
కళ్యాణ్ కాకుండా మిగతా 8 సీజన్లలో గెలిచిన ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంతగా ఎప్పుడూ హడావుడి చేయలేదు. అలా చేయలేదు కాబట్టే, వాళ్లు ఎవరూ లైమ్‌లైట్‌లో లేకుండా పోయారని భావించాడో ఏంటో.. తనను పిలిచి ఏదో ఒక నిర్మాత అవకాశం ఇవ్వకపోతాడా? తనని పెట్టి ఏదో ఒక దర్శకుడు సినిమా చేయకపోతాడా? అన్నట్లుగా కళ్యాణ్ పడాల గేమ్ ఆడుతున్నాడు. హౌస్‌లోనే కాదు, వచ్చిన తర్వాత కూడా ఈ టాస్క్‌ని జయిస్తాననే ధీమాలో ఉన్నాడు. ఇక ఆయనని చూసిన జనాలు కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అవుతుండటం విశేషం. ఆ జనాల అతి చూస్తే.. ఈ వీడియోలో యాంకర్ పలికిన మాట నిజమనిపిస్తుంది. ‘ఇంత కరువులో ఉన్నారేంట్రా’ అని యాంకర్.. జనాలపై పంచ్ వేసింది. మరి కళ్యాణ్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో తెలియదు కానీ, తనపై ఫోకస్ పడేలా భారీగానే ప్లాన్ చేస్తున్నాడని ఇలాంటివి చూస్తుంటే.. అర్థమవుతోంది.
#KalyanPadala𓃵. #Kalyanpadala
Bodyguards rescued him
Anchor : entra idhii😂😂😂 pic.twitter.com/9X8BYPiaIa— Pluto (@Pluto538608) January 6, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

