First Ticket: ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతుంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాబోయే సంక్రాంతి (Sankranti 2026)కి చిరంజీవి (Chiranjeevi), ప్రభాస్ (Prabhas), రవితేజ (Ravi Teja) వంటి స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందనే విషయం పక్కన పెడితే.. సంక్రాంతికి అన్ని సినిమాలను భరించే సత్తా ఉంది. ఎందుకంటే, సంక్రాంతికి ఫెస్టివల్ మూడ్‌లో అందరూ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కోరుకుంటారు. గాలిపటాలు, కోడి పందాలు, పిండి వంటలు ఎలా అయితే ఈ ఫెస్టివల్‌లో భాగమో.. సినిమా కూడా అంతే. అందుకే ఎప్పుడూ థియేటర్లకి వెళ్లని వారు కూడా ఈ సంక్రాంతికి ఇంటి నుంచి కదులుతారు. ఇప్పుడు కాస్త తగ్గింది కానీ, ఒకప్పుడు అయితే బళ్లు, ట్రాక్టర్స్‌తో జనం సినిమాలకు తరలి వెళ్లేవారు. సరే.. ఇక విషయానికి వస్తే..
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?
రూ. 5 లక్షలతో పవన్, బాలయ్య రికార్డ్
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు ‘ఫస్ట్ టికెట్’ (First Ticket) అనే ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ‘ఓజీ’ సినిమాకు (OG First Ticket) ఫస్ట్ టికెట్ ధర రూ. 5 లక్షలు పలికింది. నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం ఫస్ట్ టికెట్‌ను రూ. 5 లక్షలకు సొంతం చేసుకుని, తిరిగి ఆ అమౌంట్‌ను జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. తెలంగాణలోనూ ఓ అభిమాని రూ. 1,29,999 కి కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. బెంగళూరుకు చెందిన అభిమాన సంఘం రూ. 3.61 లక్షలకు, చెన్నైకి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు రూ. 1.72 లక్షలకు వేలంలో టికెట్లను దక్కించుకుని, ఆ మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం విశేషం. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘అఖండ 2’ ఫస్ట్ టికెట్ (Akhanda 2 First Ticket)ను రూ. 5 లక్షలకు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాగే జర్మనీలో జరిగిన వేలంలో రాజశేఖర్ అనే బాలయ్య అభిమాని 1000 యూరోలకు అంటే సుమారు రూ. లక్షకు టికెట్ దక్కించుకున్నారు. ఇలా స్ట్రాంగ్ రికార్డులే ఉన్నాయి.
Also Read- Director Maruthi: ‘నాచె నాచె’ సాంగ్‌పై నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన మారుతి!
చిరు సినిమాకు రూ. లక్షతోనే మొదలు
ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. ఈ సంక్రాంతికి రాబోతున్న మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రానికి సంబంధించి కూడా వేలం మొదలైంది. ఈ సినిమా ఫస్ట్ టికెట్‌ను నర్సాపురానికి చెందిన చాగంటి గణేశ్ అనే అభిమాని రూ. 1 లక్ష 2 వేలకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అమలాపురంలో చిరంజీవి అభిమాని ఒకరు ఈ సినిమా ఫస్ట్ టికెట్‌ను రూ. లక్షా 11 వేలకు సొంతం చేసుకున్నారు. బెనిఫిట్ షో టికెట్‌ను ఇలా వేలంలో దక్కించుకున్న అభిమానులు ఆనందంలో మునిగి తేలుతుంటే, మరోవైపు మాత్రం చిరు, బాలయ్య అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుంది. ‘అఖండ 2’ ఫస్ట్ టికెట్ రూ. 5 లక్షలు అంటూ బాలయ్య అభిమానులు హేళన చేస్తుంటే.. ఇప్పుడేగా మొదలైంది, అంతా ముందుంది.. అప్పటి వరకు కాస్త ఆపుకోండి అంటూ చిరు ఫ్యాన్స్ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు. చిరు సినిమా ఫస్ట్ టికెట్ విషయంలో రికార్డ్ కొడతామని అభిమానులు ఛాలెంజ్ విసురుతున్నారు. ‘రికార్డుల్లో నేను ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయ్’ అనే చిరంజీవి డైలాగ్‌లా.. ఫస్ట్ టికెట్ వేలం ఏ రేంజ్‌కు వెళుతుందో చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

