Director Maruthi: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నుంచి రాబోతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా దర్శకుడు మారుతి (Director Maruthi) తెరకెక్కించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో అన్ కాంప్రమైజ్డ్‌గా నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో భారీ తారాగణం ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు జరీనా వాహబ్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ వంటి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ఉంది. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్ కూడా యమా జోరుగా మేకర్స్ నిర్వహిస్తున్నారు. సోమవారం ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమా నుంచి ‘నాచె నాచె’ సాంగ్‌ని విడుదల చేశారు. ఇప్పుడీ సాంగ్ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.
Also Read- Anasuya: రాశి గారి ఫలాలపై సారీ చెప్పిన అనసూయ.. పోస్ట్ వైరల్
నెటిజన్‌కు మారుతి కౌంటర్
ఈ సాంగ్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ తమ గ్లామర్ ప్రదర్శనతో ఆకట్టుకోగా, ప్రభాస్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ‘సాహో’ మూవీలోని బ్యాడ్ బాయ్ సాంగ్‌ని తలపించేలా ఉన్న ఈ సాంగ్‌లో ప్రభాస్ తన అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేశారు. ఈ పాట ఇప్పుడు అందరినీ అలరిస్తోంది. ఈ క్రమంలో ఈ పాటపై ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు డైరెక్టర్ మారుతి ఇచ్చిపడేశారు. ఈ పాటపై నెటిజన్.. ‘ఈ సాంగ్‌ని ఎండ్ కార్డ్స్ అప్పుడు పెడితే..’ అంటూ ఓ బూతు పదం వాడాడు. దీనికి మారుతి స్పందిస్తూ.. ‘ఇలాంటి లత్కోరు ప్రిడిక్షన్స్ చేస్తే.. నేను కూడా నిన్ను సేమ్’ అంటూ ఆ బూతు పదం వాడకుండా, తనకి గట్టిగా తగిలేలా చురక అంటించాడు. మారుతి సమయస్ఫూర్తి సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘భలే ఇచ్చావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మారుతి ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read- Bhagavanth Kesari: ‘జన నాయగన్’ ఎఫెక్ట్.. బాలయ్య సినిమా కోసం ఓటీటీలో ఎగబడుతున్నారు
ముగ్గురే చూసుకుంటున్నారు
ఇక ఈ సాంగ్‌లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ గ్లామర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు వాళ్లు ఇలా కనిపించి ఉండరు. అంత హాట్‌గా ఈ పాట కోసం వారు గ్లామర్ ఒలకబోశారు. ఈ పాట, ఈ సినిమా వారికి ఎలా ప్లస్ అవుతుందో తెలియదు కానీ, వారు మాత్రం ఈ సినిమా కోసం చాలా చేశారని చెప్పొచ్చు. ప్రమోషన్స్‌లో కూడా ఈ ముగ్గురు హీరోయిన్లు పోటీ పడి మరీ పాల్గొంటున్నారు. ప్రభాస్ లేకుండా, ఈ ముగ్గురే ముంబై ప్రమోషన్స్ చేయడం విశేషం. పాన్ ఇండియా వైడ్‌గా జనవరి 9న వస్తున్న ‘ది రాజా సాబ్’పై రెబల్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ తర్వాత ఈ సినిమాపై ఉన్న అంచనాలు డబుల్ అయ్యాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంత వరకు రీచ్ అవుతుందో తెలియాలంటే ఇంకో మూడు రోజు వెయిట్ చేయాల్సిందే.
Eh song ni End Cards appudu pedethe dengutha @DirectorMaruthi 😐#TheRajaSaab
pic.twitter.com/NmVlDeqqLl— Sethuu (@SethuMadhav002) January 5, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

