Anasuya: నటుడు శివాజీ (Sivaji) ఇటీవల ‘దండోరా’ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఏ స్థాయిలో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెద్ద కాంట్రవర్సీగా మారాయి. చిన్మయి, అనసూయ (Anasuya) వంటి వారు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవడంతో పాటు మహిళా కమిషన్ కూడా కలగజేసుకుని శివాజీ వివరణ కోరింది. ఈ కాంట్రవర్సీపై కొందరు శివాజీకి సపోర్ట్‌గా నిలిస్తే.. మరికొందరు, మహిళల దుస్తులపై మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారంటూ, శివాజీ మాటల్ని ఖండించారు. కాస్త ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న ఈ కాంట్రవర్సీలోకి తాజాగా రాశి వచ్చి చేరారు. శివాజీ రెండు మూడు మాటలు తప్పుగా మాట్లాడారు.. కానీ పూర్తిగా ఆయన తప్పేం మాట్లాడలేదు అని చెప్పిన రాశి.. అనసూయ, రోజా (Roja)ను ఉద్దేశిస్తూ గతంలో వారు తనపై చేసిన చిల్లర కామెంట్స్‌ను, నవ్వులను గుర్తు చేశారు. ఆది, అనసూయ జబర్ధస్త్ కామెడీ షోలో ‘రాశి ఫలాలు బదులు రాశిగారి ఫలాలు’ అని చెప్పి నవ్వుతున్నారు. ఈ వీడియోపై రాశి రియాక్ట్ అవుతూ.. అనసూయకు, రాశి (Raasi)కి ఇచ్చిపడేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో రాశికి క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా అనసూయ ఓ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో..
Also Read- Zarina Wahab: డార్లింగ్ అంటే ఏంటి? అని ప్రభాస్‌ను అడిగా! నా దృష్టిలో డార్లింగ్ అంటే..
వెనక్కి వెళ్లి సరిదిద్దలేను..
‘‘రాశి గారికి నా క్షమాపణలు తెలుపుకుంటున్నాను.., మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో ‘‘తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ, అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. దయచేసి నా క్షమాపణలను అంగీకరిండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను. మనుషులు మారుతుంటారు, ఆ షో లో ద్వంద్వార్ధపు మాటలని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు, వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి ధ్వేషించడమే పనిగా పెట్టుకుని ట్రోలింగ్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను. ఆ కార్యక్రమం దర్శక రచయిత నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా, చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెప్తున్నాను.
Also Read- MSG Trailer: అనిల్ రావిపూడి గారూ.. బుల్లిరాజు ఎక్కడ?
నన్ను అర్థం చేసుకోండి
మహిళల శరీరాల చుట్టూ అల్లిన కథనాలను ప్రశ్నించడానికి నేను మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా, సాధికారతతో ఉన్నాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారని, నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నాను. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను మేడమ్’’ అని అనసూయ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనసూయ ఈ పోస్ట్‌కు కామెంట్స్ చేసే అవకాశం లేకుండా బ్లాక్ చేశారు. లేదంటే, నెటిజన్లు ఆమెపై విరుచుకుపడేవారే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా అనసూయ జాగ్రత్తలు తీసుకున్నారు.
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

