Zarina Wahab: డార్లింగ్ అంటే ఏంటి? అని ప్రభాస్‌ను అడిగా!
The Raja Saab Event (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Zarina Wahab: డార్లింగ్ అంటే ఏంటి? అని ప్రభాస్‌ను అడిగా! నా దృష్టిలో డార్లింగ్ అంటే..

Zarina Wahab: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), డైరెక్టర్ మారుతి (Director Maruthi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). హారర్ కామెడీ జానర్‌లో ఎవర్ గ్రీన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై గ్రాండ్‌గా నిర్మించారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ సినిమాలోని ‘నాచె నాచె’ సాంగ్‌ (Nache Nache Song)ను సోమవారం ముంబైలో జరిగిన వేడుకలో బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు.

Also Read- MSG Trailer: అనిల్ రావిపూడి గారూ.. బుల్లిరాజు ఎక్కడ?

డార్లింగ్ అనే మాటకు అర్థం

ఈ కార్యక్రమంలో ‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ నానమ్మగా నటించిన నటి జరీనా వాహబ్ మాట్లాడుతూ.. నేను కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే పుట్టాను. 40 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. తెలుగులో ఎందుకు నటించరు? ఇప్పటి వరకు చాలామంది అడిగారు. నేను గతంలో మూడు నాలుగు తెలుగు చిత్రాల్లో నటించాను. కానీ ‘ది రాజా సాబ్’లో నటించడం నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని భావిస్తున్నాను. ప్రస్తుతం రెండు మూడు తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాను. ప్రజంట్ హిందీలో ఫ్యామిలీ మూవీస్ రావడం లేదు. తెలుగులో కుటుంబ కథా చిత్రాలకు మంచి ఆదరణ ఉంది. మారుతి మా అందరితో మంచి పర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్నారు. ప్రభాస్ గురించి ఒక్కమాట చెబుతాను.. నిజమైన రాజు ప్రభాస్. అతనంటే మా అందరికీ ఎంతో ఇష్టం. ప్రభాస్‌ను అంతా డార్లింగ్ అని అంతా పిలుస్తుంటారు. ఒక రోజు డార్లింగ్ అంటే ఏంటి? అని ప్రభాస్‌ను అడిగా. అతను అందుకు ఆన్సర్ చెప్పాడు. కానీ నా దృష్టిలో మాత్రం డార్లింగ్ అనే మాటకు అర్థం ప్రభాస్. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూసి ఘన విజయం అందించాలని కోరారు.

Also Read- Lenin Movie: అరె విన్నావా విన్నావా.. ‘లెనిన్’ పాట వచ్చిందిన్నావా.. వ్వా వవ్వారె వారెవా!

ఇండియన్ సినిమాకు కొత్త జానర్

హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘8 ఏళ్ల క్రితం బాలీవుడ్‌లో టైగర్ ష్రాఫ్‌తో ‘మైఖేల్’ అనే మూవీ చేశాను. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బాలీవుడ్‌కు ఈ మూవీ ద్వారా వస్తున్నాను. రాజా సాబ్ మూవీ రొమాంటిక్ హారర్ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కింది. ఇది ఇండియన్ సినిమాకు కొత్త జానర్. ప్రభాస్ వంటి బిగ్ స్టార్‌తో నటించడం గౌరవంగా భావిస్తున్నా. పిల్లలు, పెద్దలు అంతా ఈ సినిమాను ఇష్టపడతారు. ఈనెల 9న వస్తున్న ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండని అన్నారు. హీరోయిన్ రిద్దికుమార్ మాట్లాడుతూ.. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ మూవీ కోసం కాల్ వచ్చినప్పుడు నమ్మలేకపోయాను. నేను ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో నటించాను. అయితే ప్రభాస్‌కు పెయిర్‌గా అవకాశం అనేసరికి ముందు ఫ్రాంక్ కాల్ అనుకున్నా. ఎస్‌కేఎన్, మారుతి ముంబై వచ్చి స్క్రిప్ట్ చెప్పారు, ఫొటో షూట్స్ చేశాం. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని ఫస్ట్ టైమ్ తెలుగు డబ్బింగ్ కూడా చెప్పాను. ప్రభాస్ మంచి ఫుడ్‌ను భారీ క్వాంటిటీలో పంపేవారు. నాకు, మా టీమ్‌తో పాటు సినిమా యూనిట్‌కు కూడా ఆ ఫుడ్ సరిపోయేది. ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశాను. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ సరసన నటించడం చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. మరో హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. తెలుగులో ఒక పెద్ద ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న నాకు.. నేను కోరుకున్నట్లే రాజా సాబ్ లాంటి ప్రెస్టీజియస్ మూవీ అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించడం ఎప్పటికీ మర్చిపోలేను. అందుకు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్‌కు, డైరెక్టర్ మారుతికి ధన్యవాదాలు. ఈ సినిమాను అందరూ జనవరి 9న థియేటర్లలో చూడాలని కోరతున్నానన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Congress Party: కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ అంశం మరోసారి చర్చ.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల విషయంలో పక్కా వ్యూహం!

Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. గంటకు 150 కి.మీ వేగం.. టికెట్ రూ.5 మాత్రమే?

Ponguleti Srinivas Reddy: ఈ ఏడాది ఆ నెలలోనే భూభారతి పోర్టల్​.. భూముల కొలతల్లో ఇక అక్రమాలకు చెక్!

Samantha Movie: సమంత ‘మా ఇంటి బంగారం’ టీజర్ ట్రైలర్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

TG High Court: ‘భార్య వంట చేయడం లేదని ఫిర్యాదు’.. తెలంగాణ హైకోర్టు షాకింగ్ కామెంట్స్