Bhagavanth Kesari: కోలీవుడ్‌లో స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) నటించిన ‘వీరమ్’ (Veeram) చిత్రాన్ని, తెలుగులో కూడా విడుదల చేసిన తర్వాత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ‘కాటమరాయుడు’ (Katamarayudu) రూపంలో రీమేక్ చేశారు. ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సేమ్ టు సేమ్ నందమూరి నటసింహం బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ‘జన నాయగన్’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో కూడా ‘జన నాయకుడు’ (Jana Nayakudu) పేరుతో విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో తెలియదు కానీ, సంక్రాంతి భారీ కాంపిటేషన్‌లో ఈ సినిమాను వదులుతున్నారు. ఇది విజయ్ చివరి సినిమా అనే విషయం తెలిసిందే. అందుకే పాన్ ఇండియా వైడ్‌గా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టాలీవుడ్‌లో ‘జన నాయకుడు’ జనవరి 9న విడుదల కాబోతోంది.
Also Read- Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?
టాప్ 1లో ట్రెండింగ్
టాలీవుడ్ స్ట్రయిట్ ఫిల్మ్, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ కూడా అదే రోజున విడుదలవుతోంది. థియేటర్ల విషయంలో ఓ తమిళ సినిమాకు ప్రభాస్ సినిమా, అదీ టాలీవుడ్‌లో పోటీగా విడుదల చేస్తున్నారు. మరో వైపు కోలీవుడ్‌లో మాత్రం ప్రభాస్ ‘ది రాజా సాబ్’కు థియేటర్లు ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావడం లేదనే వార్త బాగా హైలెట్ అవుతోంది. దీంతో టాలీవుడ్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ.. ఇక్కడ ‘జన నాయకుడు’ చిత్రానికి కూడా థియేటర్స్ ఇవ్వ వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. ఈ గొడవ ఇలా ఉంటే, ఇప్పుడు ‘జన నాయగన్’ పుణ్యమా అని, బాలయ్య ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమా కోసం ఓటీటీలో తమిళ ప్రేక్షకులు ఎగబడుతున్నారట. అవును, ‘భగవంత్ కేసరి’ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఈ సినిమా వచ్చి, దాదాపు రెండేళ్లు అవుతుంది. ఈ టైమ్‌లో ‘భగవంత్ కేసరి’ చిత్రం టాప్ 1లో ట్రెండింగ్ అవుతున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ కూడా ప్రకటించింది.
Also Read- Poonam Kaur: అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని.. పూనమ్‌ని బెదిరించిన కడప వ్యక్తులెవరు?
ఫుల్ హ్యాపీలో ప్రైమ్ టీమ్
జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘జన నాయగన్’ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో, ఒరిజినల్ ఫిల్మ్ ట్రెండింగ్‌లోకి రావడంతో, ఆ చిత్ర నిర్మాతలు ఆందోళన పడుతున్నారనేలా టాక్ నడుస్తుంది. విజయ్ చివరి చిత్రం కావడంతో, ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారని తెలుస్తోంది. పొలిటికల్‌గా ఇప్పటికే కొంతమేరకు ఫ్యాన్స్ ఆయనకు దూరమయ్యారు. సంక్రాంతికి భారీ పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గట్టెక్కుతుందా? అనేలా నిర్మాతలు భయపడుతున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘జన నాయకుడు’ ట్రైలర్ విడుదల తర్వాత, ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. అందుకే కోలీవుడ్ ప్రేక్షకులు ఓటీటీలో ‘భగవంత్ కేసరి’ని చూసేందుకు ఎగబడుతుండటం విశేషం. సడెన్‌గా ఈ సినిమా టాప్‌లోకి రావడంతో అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం ఫుల్ హ్యాపీగా ఉందట. ఎందుకంటే, విజయ్ సినిమా విడుదలైన రిజల్ట్ వచ్చేవరకు, వచ్చిన తర్వాత కూడా ‘భగవంత్ కేసరి’ టాప్‌లోనే ఉంటుందని వారు భావిస్తున్నారు. ఆగిపోయిన, అరిగిపోయిన టేపు రికార్డర్ మళ్లీ సడెన్‌గా పాడుతుంటే.. వచ్చే కిక్కే వేరు. ఆ కిక్కునే ప్రైమ్ టీమ్ ఎంజాయ్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

