The Raja Saab: ఈ సంక్రాంతికి రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ‘ది రాజా సాబ్’ (The Raja Saab) గా రాబోతున్నారు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ‘నాచె నాచె’ సాంగ్‌ని వదిలి మరింత హైప్ పెంచేశారు. సంక్రాంతి బరిలో ముందుగా థియేటర్లలోకి రాబోతుంది ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమానే అనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు పోటీగా దళపతి విజయ్ నటించిన ‘జన నాయకుడు’ అదే రోజు విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు అనూహ్యంగా కొన్ని చిక్కులు ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా అనుకున్న టైమ్‌కి విడుదలవుతుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అదే జరిగితే మాత్రం ప్రభాస్ పంట పండినట్టే.
Also Read- Bhogi: ఎట్టకేలకు ‘భోగి’ అప్డేట్.. శర్వా, సంపత్ నంది సినిమా ఉన్నట్టే!
ఏం సర్టిఫికెట్ ఇచ్చారంటే..
ఇక ఈ సినిమాకు ఒక వైపు ప్రమోషన్స్ నిర్వహిస్తూనే, మరోవైపు శరవేగంగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. దీంతో, మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ పనిలో బిజీగా ఉన్నారు. ఓవర్సీస్‌కు ఇప్పటికే కంటెంట్ రీచ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సెన్సార్ నుంచి ఈ సినిమాపై పాజిటివ్ స్పందన వచ్చినట్లుగా సమాచారం (The Raja Saab Censor Details). ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యుబైఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. నాలుగు సెకన్ల నిడివి గల సన్నివేశాలను మాడిఫై చేయాలని సూచించినట్లుగా సెన్సార్ సర్టిఫికెట్ చెబుతోంది. ఫ్లోర్‌పై నెత్తుటి మరకలను తుడిచే సన్నివేశంతో పాటు, తల నరికే సన్నివేశాలను మాడిఫై చేసినట్లుగా సెన్సార్ సర్టిఫికెట్‌లో తెలిపారు.
Also Read- Director Maruthi: ‘నాచె నాచె’ సాంగ్‌పై నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన మారుతి!
రన్ టైమ్ ఎంతంటే?
ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ వివరాల ప్రకారం ఈ సినిమా 189 నిమిషాలు, అంటే 3 గంటల 9 నిమిషాల నిడివితో విడుదల కాబోతోంది. నిజంగా ఇది సాహసమనే చెప్పాలి. కానీ, సినిమా ఎంగేజింగ్‌గా ఉంటే, ఈ నిడివి పెద్ద సమస్యే కాదు. అందులోనూ ప్రభాస్ సినిమా కాబట్టి పెద్దగా పట్టించుకోరు. తమ హీరోని ఎక్కువ సేపు చూడాలని అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు. కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పిస్తే మాత్రం.. ‘ది రాజా సాబ్’కు తిరుగులేనట్టే. ఎందుకంటే, ఈ సంక్రాంతికి వచ్చే చిత్రాలలో ఇదొక్కటే సెపరేట్ జానర్. మిగతావన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్సే. ఇది ప్రభాస్ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక మారుతి విషయానికి వస్తే.. ఇలాంటి జానర్స్‌కు మంచి క్రేజ్ తీసుకొచ్చిందే మారుతి (Director Maruthi) కాబట్టి.. ఎటు చూసినా, ‘ది రాజా సాబ్’కు ప్లస్సే కనబడుతోంది. చూద్దాం.. మరి జనవరి 9న సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో?

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

