Bhogi: ‘భోగి’ అప్డేట్.. శర్వా, సంపత్ నంది సినిమా ఉన్నట్టే!
Sharwanand Bhogi (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bhogi: ఎట్టకేలకు ‘భోగి’ అప్డేట్.. శర్వా, సంపత్ నంది సినిమా ఉన్నట్టే!

Bhogi: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) చాలా గ్యాప్ తర్వాత వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంక్రాంతికి ఆయన ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న శర్వానంద్, మరో సినిమా షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఆ సినిమా మరేదో కాదు, సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘భోగి’ (Bhogi). వాస్తవానికి ఈ సినిమా ఆగిపోయినట్లుగా ఈ మధ్య వార్తలు వచ్చాయి. సాయి దుర్గా తేజ్‌తో సంపత్ నంది (Sampath Nandi) ‘గంజా శంకర్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా తర్వాత శర్వానంద్‌తో సంపత్ నంది ‘భోగి’ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా కూడా శర్వా వ్యక్తిగత కారణాలతో ఆగిపోయినట్లుగా టాక్ నడిచింది. కానీ, తాజా అప్డేట్‌తో మేకర్స్ అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు.

Also Read- Director Maruthi: ‘నాచె నాచె’ సాంగ్‌పై నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన మారుతి!

నెవర్ బిఫోర్ పాత్రలో..

ఇంతకీ మేకర్స్ వదిలిన అప్డేట్ ఏమిటంటే.. 1960 బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతోందని తెలుపుతూ మేకర్స్ షూటింగ్ అప్డేట్ తెలియజేశారు. ఈ సినిమా కొత్త షూటింగ్ సోమవారం నుంచి హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభమైనట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక షెడ్యూల్లో టాకీ పార్ట్‌ను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో శర్వా నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించనున్నారనే విషయం ఇప్పటికే మేకర్స్ తెలిపి ఉన్నారు. శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read- Koragajja: రీల్స్ కాంటెస్ట్.. ‘కొరగజ్జ’ రూ. కోటి ఆఫర్.. అసభ్యకరంగా చేశారో!

శర్వానంద్ అకౌంట్‌లో ఉన్నట్టే..

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వచ్చిన టైటిల్ ఫస్ట్ స్పార్క్ అనే పవర్ ఫుల్ కాన్సెప్ట్ వీడియో అద్భుతమైన రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. 1960ల ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతంలో వింటేజ్ సెట్టింగ్‌తో ‘భోగి’ టెక్నికల్‌గా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందట. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ భీమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే శర్వా అకౌంట్‌లో ఈ సినిమా ఉన్నట్టుగా క్లారిటీ అయితే వచ్చేసింది. సంక్రాంతికి క్లాసీ టచ్ ఇవ్వబోతున్న శర్వానంద్.. ఈ సినిమాతో మాస్ అవతార్‌లో కనిపించి, ఎలాంటి సక్సెస్‌ని అందుకుంటాడో చూడాలి. ఎందుకంటే, మాస్‌కి కేరాఫ్ అడ్రస్ సంపత్ నంది కాబట్టి.. ఈ సినిమా నుంచి చిన్న టీజర్ వచ్చినా.. అంచనాలు అమాంతం పెరుగుతాయి. చూద్దాం.. ఎలాంటి అప్డేట్‌‌ని వదులుతారో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Megastar Chiranjeevi: రామ్ చరణ్‌కు ఏదయితే చెప్పానో.. సుస్మితకు కూడా అదే చెప్పా..

Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు

Ravi Teja: జర్నలిస్ట్‌ని ఆ ప్రశ్న అడిగేసిన రవితేజ.. మాస్ రాజా మామూలోడు కాదండోయ్!

Chiru – Venky: పాటతోనే కాదు.. ఎంట్రీతోనూ అదరగొట్టారు. మెగా విక్టరీ మాస్ ఎంట్రీ!

Sathupalli News: సత్తుపల్లి మెడికల్ సిండికేట్ దందా తనిఖీల్లో అనుమానాలు..?