Ravi Teja: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) అంటే ఎనర్జీ. ఆయన వేసే పంచ్‌లు భలే పేలుతుంటాయి. అది సినిమాల్లోనే కాదండోయ్.. స్టేజ్ మీద కూడా అలాగే ఉంటాయ్. ఆయన హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). జనవరి 13న గ్రాండ్ విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రవితేజ సరసన డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ యమా జోరుమీదున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతూ, సినిమాపై భారీగా అంచాలను పెంచేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఓ ఊపు ఊపాయి. ట్రైలర్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా బిగ్ హిట్ అనేలా టాక్ మొదలైంది.
Also Read- Varunavi: మెగాస్టార్ మాటిచ్చారు.. సరిగమప లిటిల్ చాంప్స్ వరుణవికి చిరు ఆశీస్సులు
పెళ్లికి ముందు ఎవర్నీ ప్రేమించలేదా?
ఇక ఈ థియేట్రికల్ లాంచ్ వేడుకలో రవితేజ పెద్దగా ఏం మాట్లాడలేదు కానీ, ఓ జర్నిలిస్ట్‌పై మాత్రం పంచ్ పేల్చారు. ఈ సినిమాలో ఉన్న కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకుని, జర్నలిస్ట్ ఒకరు అలా ఎలా చేస్తారండి? వైఫ్ ఉండగా అని పెద్దగా, సరదాగా అరవడంతో.. అతనిని టార్గెట్ చేస్తూ, రవితేజ ఓ ప్రశ్న సంధించాడు. ఇంతకీ ప్రశ్న ఏంటని అనుకుంటున్నారా? ‘మీరు పెళ్లి కాకముందు ఎవరినీ ప్రేమించలేదా?’ అని రవితేజ కామెడీగా జర్నలిస్ట్‌ని ప్రశ్నించడంతో.. ఆ జర్నలిస్ట్ కూడా దీనిని సరదాగానే తీసుకున్నారు. ‘చాలా ఉంటాయండి.. అవన్నీ ఇక్కడ, అందరి ముందు ఎలా చెప్తాం?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘ఆ మాట చాలు నాకు.. ఒప్పేసుకున్నారు’ అంటూ రవితేజ నవ్వుకున్నారు. ‘మనం పర్సనల్‌గా ఆ విషయాలు మాట్లాడుకుందా’ అని సదరు జర్నలిస్ట్ అనగానే రవితేజ కూడా ఓకే చెప్పారు.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. బెనిఫిట్ షో టికెట్ ధర వింటే షాకే!
సినిమా బాగుండాలి
ఇదే వేడుకలో 90స్ ఫేమ్ రోహన్ (Rohan) మాట్లాడుతూ.. ‘రాజులకే రాజు మాస్ మహారాజు’ అంటూ మొదలెట్టాడు. ఆ మాట అనగానే రవితేజ వచ్చి డిప్పపై ఒక్కటిచ్చారు. అంతా హాయిగా నవ్వుకున్నారు. ఇక రోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను చేసిన వాళ్లందరితో ఇదే ఫస్ట్ టైమ్ యాక్ట్ చేశానని చెప్పారు. రవితేజను ‘విక్రమార్కుడు’ సినిమా నుంచి ఎంతగానో ఇష్టపడుతున్నానని, అందులోని జోరుగా వాన పడుతుంటే, చనిపోయే ముందు కూడా మీసంపై చేయి వేసే సీన్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. టీమ్ అందరితో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. సినిమా బాగుండాలి, సినిమా చేసేటోళ్లు బాగుండాలి, సినిమా చూసేటోళ్లు బాగుండాలి.. జై సినిమా అంటూ రోహన్ చెప్పగానే అంతా క్లాప్స్‌తో అతన్ని ఎంకరేజ్ చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

