The Raja Saab: తెలంగాణ ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans)కు నిరాశ తప్పేలా లేదు. ఒక వైపు ఇతర చోట్ల ప్రీమియర్ పడుతుంటే.. ఇంత వరకు తెలంగాణ రాష్ట్రంలో బుకింగ్స్ (Raja Saab Bookings) ఓపెన్ కాకపోవడంతో ఫ్యాన్స్ అందరూ నిరాశలో ఉన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా, ఇంకా ప్రభుత్వం మాత్రం దోబూచులాడుతూనే ఉంది. ఇటీవల సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ టికెట్ల ధరల విషయమై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై సినిమా వాళ్లు ఎవరూ టికెట్లు పెంచమని, బెనిఫిట్ షో లంటూ మా దగ్గరకు రావద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ల ధరలు పెంచడమనేది ఉండదని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో ఇప్పుడు టికెట్ల ధరలను పెంచాలా? వద్దా? అనే మీమాంసలో ప్రభుత్వం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read- Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!
అందుకే ప్రభుత్వం ఆలోచిస్తుందా?
అందుకే ఈసారి డైరెక్ట్‌గా ప్రభుత్వాన్ని కాకుండా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత అడ్డుపడుతున్న కోర్టునే నిర్మాతలు ఆశ్రయించి సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం కరుణించడం లేదు. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా ఇంకా అడుగులు పడకుండానే, తెలంగాణలో సినిమా నిర్మాతలు ఇలాంటి ఇబ్బందుల ఫేస్ చేస్తున్నారనే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎప్పుడూ కోర్టులు అడ్డుపడుతుంటాయి. కానీ ఈసారి ప్రభుత్వమే ఆలోచనలో పడింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలనే, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకూడదని, అలాగే అందరికీ సినిమాను దగ్గర చేయాలంటే టికెట్ల ధరలు పెంచకూడదని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. కానీ, స్టార్ హీరోల సినిమాల విషయంలో మాత్రం ప్రభుత్వం మరోసారి ఆలోచించాలంటూ నిర్మాతలు మొర పెట్టుకుంటున్నారు.
Also Read- Naga Vamsi: మనమీద ఎక్కేవాళ్లకి ఈ సినిమా సమాధానమివ్వాలి..
ఏ నిమిషంలోనైనా అనుమతి రావచ్చు
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం నార్మల్‌గా కూడా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఆలస్యంగానైనా అనుమతులు ఇస్తుందని నిర్మాతలు వేచి చూస్తున్నారు. ప్రస్తుతం నిర్మాతలు ప్రభుత్వంతో మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రాత్రికి ఏ నిమిషంలోనైనా అనుమతులు వచ్చే అవకాశం ఉందని, చిత్ర వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇంత నిరీక్షణ తర్వాత కూడా ప్రభుత్వం పట్టు వీడకుంటే మాత్రం.. నైజాం మొత్తం సాధారణ ధరలతోనే శుక్రవారం ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ముందు ఏదో ఒకటి బుకింగ్స్ ఓపెన్ చేయండి అంటూ ఫ్యాన్స్ గోలగోల చేస్తున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంతగా ఆలోచిస్తుందనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ తరపున ప్రభుత్వ రాయబారిగా ఉన్న వ్యక్తి ఏమైనా కారణమా? అనేలా కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

