Naga Vamsi: నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty).. ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్ అడ్రస్. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్‌టైనర్ తను. ఈ సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి (Maari) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. గురువారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Vishnu Vinyasam: ‘దేఖో విష్ణు విన్యాసం’.. సాంగ్ ఇలా ఉందేంటి?
మనమీద ఎక్కుతున్నవాళ్లందరికీ సమాధానం
‘‘ట్రైలర్‌లో డైలాగ్స్ అన్నీ బాగున్నాయా? పంచ్‌లన్నీ పేలాయా? సినిమా అంతా అలాగే ఉంటుంది. పంచ్‌లన్నీ చక్కగా పేలతాయి. ఇందులో ఏదో కథ చెబుతాము, ఎమోషనల్‌గా ఫీలయ్యే సీన్స్ వంటివి ఏమీ ఉండవు. కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ, 2 గంటల పాటు నవ్విస్తూ.. నవీన్ స్టైల్‌లో ఎటకారంగా పంచ్‌లు సినిమా అంతా ఉంటాయి. అందరూ పండగకి థియేటర్లకు రండి. గ్యారంటీగా నవ్వుకుంటూ వెళతారు. మీరు ట్రైలర్‌లో చూసింది కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే. సినిమాలో ప్రతి సీన్‌లో పంచ్ ఉంటుంది. లాస్ట్ 15 నిమిషాలు తప్పితే.. సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో నవీన్ డిజప్పాయింట్ చేయడు. చాలా కాలం నుంచి ఈ ఒక్క కథ మీద తను కూర్చున్నాడు. ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా.. అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశాడు. ఇందులో ఎలక్షన్ బ్లాక్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు. అదంతా ఫన్ టోన్‌లో ఉంటుంది. పండగలకి వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘అల వైకుంఠపురములో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’.. అలాంటి అన్ని ఎలిమెంట్స్ కలిపి ప్రాపర్‌గా ప్యాకేజ్ చేశాం. కచ్చితంగా ఎవరూ డిజప్పాయింట్ అవరు. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి.. మనమీద ఎక్కుతున్నవాళ్లందరికీ సమాధానం చెబుదాం.. ఈసారి కాస్త గట్టిగా థియేటర్లకు రండి’’ అని నాగవంశీ చెప్పుకొచ్చారు.
Also Read- Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?
రోడ్డు ప్రమాదం వల్లే ఆలస్యం
హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది మా టీమ్ అంతా చేసిన ఏడాదిన్నర కష్టం. సంక్రాంతికి మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఈ సినిమాని రూపొందించాం. మొదటి నుంచి చివరి వరకు హాయిగా నవ్వుతూనే ఉంటారు. అదే సమయంలో అందమైన ఎమోషన్స్ కూడా ఉంటాయి. దర్శకుడు మారి మొదటి సినిమా అయినా కూడా, చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా చాలా బాగా తెరకెక్కించారు. ఈ సంక్రాంతికి నా అభిమాన హీరోలు ప్రభాస్, చిరంజీవి, రవితేజల సినిమాలు కూడా వస్తున్నాయి. అన్ని సినిమాలు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు జరిగిన ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఈ సినిమా రావడం ఆలస్యమైంది. ఆ లోటుని భర్తీ చేసేలా ‘అనగనగా ఒక రాజు’ సినిమా రెట్టింపు వినోదాన్ని ప్రేక్షకులకు అందిస్తుందని తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

