Love Letters: సంక్రాంతి వస్తుంది అంటే చాలు.. స్మాల్ స్క్రీన్‌పై ఉండే సందడే వేరు. వెరైటీ వెరైటీ ప్రోగ్రామ్స్‌తో ప్రేక్షకులను టీవీల ముందు నుంచి కదలకుండా చేసేందుకు స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈ టీవీ వంటి ఛానళ్లు.. ప్రత్యేకంగా కొన్ని ప్రోగ్రామ్స్‌ని నిర్వహిస్తుంటాయనేది తెలియంది కాదు. ఈ సంక్రాంతికి కూడా అలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్‌ని ఆల్రెడీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు రెడీ చేసి పెట్టుకున్నాయి. వాటికి సంబంధించిన ప్రోమోలను వదులుతూ.. సంక్రాంతికి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతుంతో ఆడియెన్స్‌కు ఓ క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. అందులో భాగంగానే జీ తెలుగు ఛానల్ నుంచి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు’ అంటూ ఓ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ వదిలారు. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలీ ప్రోమోలో ఏముందంటే..
Also Read- Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!
సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు
బుల్లితెరపై స్టిల్ బ్యాచ్‌లర్‌గా ఉన్న సుడిగాలి సుధీర్, ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ‘సంక్రాంతి అల్లుళ్లు పండగకి వస్తున్నారు’ (Sankranthi Allullu Pandagaki Vasthunnaru) కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. వారికే కనుక ప్రియురాళ్లు ఉంటే, వారి నుంచి ప్రేమలేఖలు వస్తే ఎలా ఉంటాయి? ప్రేయసి తన ప్రియుడి గురించి ఏం రాసింది? అనే కాన్సెప్ట్‌తో చిన్న ఈవెంట్‌ని ఇందులో మిక్స్ చేశారు. సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)కు, ప్రదీప్‌కు జీ తెలుగు ఛానల్ సీరియల్స్‌లో నటించే యువ నటీమణులు కొందరు ప్రేమలేఖలు రాశారు. ఆ ప్రేమలేఖలను వారు రాస్తున్నట్లుగా చూపిస్తూ.. సుధీర్‌కు వచ్చిన ప్రేమలేఖలని ప్రదీప్ చదువుతుంటే, ప్రదీప్‌కి వచ్చిన ప్రేమలేఖలని సుధీర్ చదివి వినిపిస్తున్నారు. ఈ లేఖల్లో ఏముందంటే..
Also Read- Chiranjeevi: సంక్రాంతి మనదే అంటే నాది ఒక్కడిదే కాదు.. అందులో వాళ్లంతా ఉన్నారు
సుధీర్‌కు నేను అర్థాంగి
ముందుగా సుధీర్‌కు వచ్చిన లేఖను ప్రదీప్ చదువుతున్నారు.. ‘‘ఓం సుధీర్ బావయనమ:.. నీ అందం పాలపుంత, నీ స్పర్శ తాకితే పులకింత’’ అని ఒక లెటర్‌లో.. ‘గాలి ఓ గాలి, నింగి ఓ నింగి.. సుధీర్‌కు నేను అర్థాంగి’ అని సుధీర్‌కు వచ్చిన లెటర్స్‌ను ప్రదీప్ చదువుతుంటే.. ఒక్కసారిగా అక్కడి వాతావరణ మారిపోయింది. జడ్జిలు శేఖర్ మాస్టర్, రోజా పడి పడి నవ్వుతున్నారు. ఇక ప్రదీప్‌కు వచ్చిన లెటర్స్‌ని సుధీర్ చదివారు. ‘డియర్ ప్రదీప్.. ఈ లోకంలో మగాళ్లు ఎంతమంది ఉన్నా, నా మనసు మాత్రం నిన్నే మొగుడు అని పిలవమంటుంది. ఈ ప్రాణం నీ సొంతం.. ఇట్లు నీ భూమిక మాచిరాజు’ అని సుధీర్ అనగానే ప్రదీప్ ముఖం వెలిగిపోయింది. ఆ లేఖను రాసిన భూమికను దగ్గరకు తీసుకుని, ఎక్కడికో వెళ్లిపోయాడు ప్రదీప్.. అది ఈ లవ్‌లెటర్స్ సంగతి. మొత్తంగా చూస్తే.. ఈ సంక్రాంతి (Sankranthi)కి ఈ అల్లుళ్లు ఇద్దరూ మాత్రం మాములుగా ఎంటర్‌టైన్ చేయరనే విషయాన్ని మాత్రం ఈ ప్రోమో తెలియజేస్తుంది. ఈ కార్యక్రమానికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రమోషన్స్ నిమిత్తం అనిల్ రావిపూడి, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం రవితేజ, ఆషిక, డింపుల్ కూడా వచ్చిన వచ్చినట్లుగా ఈ ప్రోమోతో తెలియజేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

