Jana Nayagan: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడుతున్నాయి. కారణం, ఆర్థిక ఇబ్బందులని, సెన్సార్ ఇబ్బందులని ఏదో ఒకటి చెబుతున్నారు కానీ, వెనుక విషయం మాత్రం వేరే ఏదో ఉంటుందనేది తెలియంది కాదు. నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘అఖండ 2’ (Akhanda 2) మూవీ ఇంకో గంటలో ప్రీమియర్ పడుతుందనగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను కోర్టు ఆపేసింది. అందుకు ఆర్థిక ఇబ్బందులే కారణమని పైకి చెబుతూ వచ్చారు. నిజంగా ఆర్థిక ఇబ్బందులే అయితే.. చివరి నిమిషం వరకు నిర్మాతలు ఎందుకలా వ్యవహరించారు? అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. సినిమా ఆర్థిక ఇబ్బందులున్న విషయం తెలిసి కూడా, సినిమా విడుదల వరకు కామ్‌గా ఉండటంతో బాలయ్యకు కూడా కోపం తెప్పించింది. అందుకే ఆ నిర్మాతలు సినిమా విడుదల తర్వాత ఈవెంట్లలో ఎక్కడా కనిపించలేదు. ఇదిలా ఉంటే, ఇప్పుడు విజయ్ (Vijay) సినిమా ‘జన నాయగన్’ (Jana Nayagan) కూడా సేమ్ టు సేమ్ రిలీజ్ రేపు అనగా ఆగిపోయింది.
Also Read- Niharika Konidela: సంగీత్ శోభన్‌తో నిహారిక నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది
ఆర్థిక ఇబ్బందులైతే కానే కాదు
ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఆర్థిక ఇబ్బందులైతే కానే కాదు. ఎందుకంటే, నిర్మాత సౌండ్ పార్టీ. ప్రస్తుతం ఈ నిర్మాత స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. కాబట్టి.. ఆర్థిక పరమైన ఇబ్బందులు కానే కాదు. మరి ఏంటి? అంటే సెన్సార్ అని చెబుతున్నారు. నిజంగా సెన్సార్ ప్రాబ్లమ్స్ అయితే, వెంటనే పరిష్కరించుకోవచ్చు, కాకపోతే ఒక రోజు టైమ్ పడుతుంది. వాళ్లు చెప్పిన సన్నివేశాలు తొలగించడానికి. కానీ ఇక్కడ సెన్సార్ అధికారులు అంతా ఓకే అయిన తర్వాత, సర్టిఫికెట్ ఇవ్వడం ఆపేశారనేలా టాక్ నడుస్తుంది. అందుకే నిర్మాత కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులు కూడా ప్రభుత్వ కనుసన్నలలోనే నడుస్తున్నాయనే విషయం పాపం ఆ నిర్మాతకు తెలిసి ఉండకపోవచ్చు. కావాలనే, ఈ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయం ఇక్కడ క్లియర్‌గా తెలుస్తోంది.
Also Read- The Raja Saab: తెలంగాణ ప్రభాస్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా? ఇంకా ఓపెన్ కాని బుకింగ్స్!
పాలిటిక్సే కారణమా..
దళపతి విజయ్ పొలిటికల్ అరంగేట్రం, కాంగ్రెస్‌తో కలిసి వెళతాననే సంకేతం.. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. ఏదో విధంగా విజయ్ సినిమాను దెబ్బకొట్టాలనే ఈ గేమ్ ఆడుతున్నారనేలా విజయ్ అభిమానులు, కాంగ్రెస్ లీడర్లు ఫైర్ అవుతున్నారు. నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే, పొలిటికల్‌గా చూసుకోవాలి కానీ, ఇలా చివరి నిమిషంలో సినిమాకు అడ్డుపడి, ఆపడం కరెక్ట్ కాదు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటివి ఫేస్ చేశారు. తర్వాత పరిస్థితులు ఎలా మారిపోయాయో తెలియంది కాదు. ఇప్పుడీ సినిమా విషయంలో కూడా విజయ్‌కు సినిమా ఇండస్ట్రీ నుంచే కాకుండా, ప్రేక్షకుల మద్దతు కూడా లభిస్తోంది. ఇది అనే కాదు.. విజయ్ గత పది, పదిహేను సినిమాలు ఇలాంటి ఏదో ఒక ప్రాబ్లమ్ లేకుండా విడుదలైన దాఖలాలే లేవు. మరి ఎందుకింతగా అంటే పొలిటికల్ కారణాలే అని చెప్పుకోవాలి. చూద్దాం.. ఈ ఘటన ఎంత వరకు దారితీస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

