Thandel
Cinema, ఎంటర్‌టైన్మెంట్

Thandel | ‘తండేల్​’​కు దర్శకేంద్రుడి ప్రశంసలు

‘‘చాలా కాలం తర్వాత మనసుకు హత్తుకునే సినిమాను చూశాను” ‘తండేల్​’ (Thandel) చిత్రం చూసిన తర్వాత ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలివి. మాములుగా ఆయన అసలు ఎక్కువగా మాట్లాడరు. ఆయన గొంతు విప్పే సందర్భాలు అతి తక్కువ. ఏదో అద్భుతం జరిగితే కానీ ఆయన స్పందించరు. అడపాదడపా సినిమా వేడుకల్లో కనిపించినప్పటికీ ఆయన అతి తక్కువగా మాట్లాడుతారు.

అలాంటి రాఘవేంద్రరావు… తండేల్​ (Thandel) సినిమాను చూసి మనసుకు హత్తుకునే ప్రేమకథను చూశానని, దర్శకుడి ప్రతిభ అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇది ఆ చిత్రానికి వంద కోట్ల షేర్​ వ్యాల్యూ లాంటిదనే చెప్పాలి. ‘ఎక్స్​’ వేదికగా తన అభిప్రాయాన్ని తెలిపిన ఆయన… ‘‘ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ​ ఒక దర్శకుడి సినిమా’’ అంటూ మూవీని ఆకాశానికి ఎత్తారు. కాగా, ఈ నెల 7న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే విజయవంతంగా దూసుకుపోతోంది.

Also Read : డ్రై షాంపూతో లాభ‌మా? న‌ష్ట‌మా?

దర్శకేంద్రుడి నుంచి ప్రశంసలు రావడంపై చిత్ర యూనిట్​ ఉబ్బితబ్బిబ్బైపోతోంది. హీరో నాగచైతన్య స్పందిస్తూ… “థ్యాంక్యూ సో మచ్​ సర్​! మీ అంతటి వారికి మా సినిమా నచ్చడం ఎంతో సంతోషకరం” అని పేర్కొన్నారు. కాగా, నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్​’ యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం అనే గ్రామానికి చెందిన కొందరు వేటగాళ్లు అనుకోకుండా పాకిస్థాన్​ కోస్టు గార్డులకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?