Mahabubabad SP: వాయలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్, పవర్ ఆఫ్ చేంజ్ ఇస్ ఇన్ హాండ్స్ అంటూ మహిళల భద్రత కోసమే ప్రత్యేకమైన షీ టీమ్స్ పని చేస్తున్నాయని మహబూబాబాద్ ఎస్పీ (Mahabubabad SP) డాక్టర్ పి శబరిష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ మహిళల సురక్షతకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పోలీసుల ప్రత్యేక విభాగం. ఈ విభాగం 2014 అక్టోబర్ 24న హైదరాబాదులో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 331 షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. షీ టీమ్స్ ఒక్కొక్కటి ఎస్సై ల ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఆ బృందంలో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో ముగ్గురు కానిస్టేబుల్స్ పనిచేస్తున్నారు. ఈ బృందాలు అన్ని అండర్ కవర్గా పనిచేసే ఈవ్ టీజింగ్, స్టాకింగ్, హరాస్మెంట్ లను నిర్మూలించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని ఎస్పీ శబరిష్ వెల్లడించారు.
షీ టీమ్స్ చేసే ప్రత్యేక కార్యకలాపాలు
వాట్సాప్, సోషల్ మీడియా (ఫేస్బుక్, ట్విట్టర్), హక్ ఐ ఆఫ్ , ఈమెయిల్ తోపాటు 100 డయల్ కు వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేకంగా స్పందించి అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, కాలేజీలు, వివిధ రకాల మార్కెట్ ప్రాంతాల్లో స్పెషల్గా డేకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. మహిళలు, యువతులు, బాలికలపై చేస్తున్న అరాచకాల ను గమనిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టులు చేస్తుంటారు. ఆ సమయంలో కౌన్సిలింగ్ నిర్వహించడంతోపాటు ఆవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్, కాలేజీ లలో షీ టీమ్స్ బృందాలు నిర్వహణను కొనసాగిస్తాయి. చైల్డ్ మ్యారేజ్ లా ను నిరోధించడంతోపాటు సైబర్ హరాస్మెంట్ లను గుర్తించి సంబంధిత మహిళలు, యువతులకు సహాయపడతారు. ఇటీవల కాలంలో షీ టీమ్స్ బృందాలు దాదాపు 13 మందిని పట్టుకొని అందులో 11 మేజర్లు, ఇద్దరు మైనర్లుగా గుర్తించి ఏడు మందికి విస్తృతమైన కౌన్సిలింగ్ నిర్వహించారని వివరించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ లో 45 రోజుల్లో 176 మంది (అందులో 134 మంది అడల్ట్స్, 42 మంది మైనర్లు) అరెస్టులు చేసినట్లుగా వివరించారు. సైబరాబాద్ లో జనవరి 3 నుంచి 9వ తేదీ వరకు 127 డేకాయ్ ఆపరేషన్లు నిర్వహించి 59 మంది ని అరెస్టు చేసినట్లు వివరించారు.
Also Read: Mahabubabad SP: అనుమానితులపై దృష్టి.. రాత్రి వేళల్లో పోలీసుల సడన్ చెకింగ్స్!
షీ టీమ్స్ బృందాల అటాక్ తో తగ్గిన కేసులు
తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ ఏర్పడిన నాటి నుంచి మహిళలపై 85% అరాచకాలు, ఈవ్ టీజింగ్, లతోపాటు ఇతర దాడులు తగ్గిపోయాయని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ పి శబరీష్ వెల్లడించారు. షీ టీమ్స్ ద్వారా ప్రయోజనాలు షీ టీమ్స్ ద్వారా మహిళలకు కీలక ప్రయోజనాలు జరుగుతున్నాయని, అందుకోసం జిల్లాలో షీ టీమ్స్ బృందాలు విస్తృతంగా పనిచేస్తున్నాయని ఎస్పీ తెలిపారు. మహిళలపై జరిగే అండర్ కవర్ డేకాయ్ ఆపరేషన్ల ద్వారా ఆకతాయిలకు కౌన్సిలింగ్ లు నిర్వహించడం, అక్కడి పరిస్థితుల ఉధృతలను బట్టి అరెస్టులు చేయడం షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంతేకాకుండా సైబర్ హరాస్మెంట్లు, చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న ప్రాంతాల్లో 24/7 హెల్ప్ లైన్ 181 ద్వారా సమాచారం తెలుసుకొని వారికి కావలసిన సహాయాన్ని షీ టీమ్స్ బృందాలు అందిస్తున్నాయని ఎస్పీ డాక్టర్ పి శబరిష్ వెల్లడించారు.
Also Read: Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాల్లో తిరుగుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?

