GHMC Commissioner: పారిశుద్ధ్య కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం
GHMC Commissioner ( image credit: twitter)
హైదరాబాద్

GHMC Commissioner: పరిశుభ్ర నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలి : అధికారులకు కర్ణన్ కీలక సూచనలు!

GHMC Commissioner: గ్రేటర్ హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం మరింతగా మెరుగుపరచడానికి జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, మరింత ఫోకస్ పెంచాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశించారు. నగరంలో జీహెచ్ఎంసీ (GHMC )ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కర్ణన్ మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు పరిశుభ్రత ప్రాధాన్యతపై ప్రజలను చైతన్యవంతులను చేయాలని సూచించారు. ప్రజా భాగస్వామ్యంతో పరిశుభ్ర నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని సూచించారు.

Also Read: GHMC Commissioner: భవన నిర్మాణ అనుమతికి సరి కొత్త సంస్కరణలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం

2,552 మెట్రిక్ టన్నుల వ్యర్థాల తొలగింపు

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 6వ తేదీ వరకు 1,882 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 670 మెట్రిక్ టన్నుల నిర్మాణ వ్యర్థాలను తరలించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం మరింతగా మెరుగుపరచడానికి 300 వార్డుల్లో చేపట్టిన ఈ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతుందని, ఒక్కో రోజు ఒక్కో అంశంపై ఫోకస్ చేస్తూ జీహెచ్ఎంసీ ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవ్ తొమ్మిదవ రోజైన బుధవారం గ్రీన్ వేస్ట్‌ను తొలగించడంపై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు అధికారులు వివరించారు.

Also Read: GHMC Commissioner: సహాయక చర్యల్లో వేగం పెంచండి: కమిషనర్ కర్ణన్

Just In

01

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన

MLA Bhukya Murali Naik: ప్రజల అభిప్రాయం మేరకే టికెట్స్.. పైరవీలు పనికిరావు: ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్

Navy New Base: ఇకపై చైనా, బంగ్లాదేశ్‌లపై డేగకన్ను.. కొత్త నేవీ బేస్ ఏర్పాటుకు రంగం సిద్ధం.. ఎక్కడో తెలుసా?

Jogulamba Gadwal: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని.. వృద్ధురాలి అంత్యక్రియలు అడ్డగింత..?