Yuvraj Singh Hyd Visit: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన యువరాజ్
Yuvraj Singh Hyd Visit (Image Source: Twitter)
హైదరాబాద్

Yuvraj Singh Hyd Visit: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన యువరాజ్.. నేడే ‘బిగ్ అకాడమీ’ ప్రారంభోత్సవం

Yuvraj Singh Hyd Visit: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ హైదరాబాద్ నగరంలో అడుగుపెట్టారు. నేడు (జనవరి 6) ప్రారంభం కానున్న ‘బిగ్ అకాడమీ’ ప్రాంభోత్వవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. బిగ్ అకాడమీ యువరాజ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం రాత్రే నగరంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో యువరాజ్ సింగ్ కు ఘన స్వాగతం లభించింది. ఇదిలా ఉంటే ఐఐటీ-జేఈఈ, నీట్ ఎగ్జామ్స్ కు అభ్యర్థులను సన్నద్దం చేయడమే లక్ష్యంగా ‘బిగ్ అకాడమీ’ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో సాయంత్రం 5 గంటలకు జరగనున్నఈ కార్యక్రమంలో యువరాజ్ సింగ్ స్వయంగా పాల్గొని బిగ్ అకాడమీని ప్రారంభించనుండటం విశేషం.

హైబ్రీడ్ లెర్నింగ్ విధానం

‘బిగ్ అకాడమీ’ విషయానికి వస్తే.. ఈ విద్యాసంస్థ హైబ్రీడ్ లెర్నింగ్ విధానంపై దృష్టి పెట్టి అభ్యర్థులను సన్నద్దం చేయనుంది. ప్రస్తుతం విద్య పేరుతో విద్యార్థులు పడుతున్న మానసిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు ఇంటెలిజెంట్ లెర్నింగ్ పై స్టూడెంట్స్ ఫోకస్ ఉండేలా వారిని తీర్చిదిద్దనుంది. అభ్యర్థుల మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసేలా, కేంద్రీకృత విద్యా వ్యవస్థను రూపొందించాలనే లక్ష్యంతో బిగ్ అకాడమీని ఏర్పాటు చేశారు.

సవాళ్లను ఎదుర్కొనేలా..

ప్రస్తుతం రోజుల్లో మెజారిటీ విద్యాసంస్థలను బట్టి పట్టి చదివేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. దీనివల్ల విద్యార్థుల్లో సబ్జెక్ట్ పై లోతైన అవాగహన కొరవడుతోంది. కొందరైతే స్కూల్, కాలేజీ యాజమాన్యం ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. కాబట్టి బట్టీ పట్టీ చదివించే ధోరణికి బిగ్ అకాడమీ పూర్తి వ్యతిరేకమని ఆ సంస్థ సీఈఓ రమణ భూపతి తెలిపారు. టెక్నాలజీకి మానవీయ మార్గదర్శకత్వాన్ని జోడించి ఆత్మవిశ్వాసం కూడగట్టుకునేలా విద్యార్థులను తయారు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులను కేవలం పరీక్షలకే కాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సైతం ఎదుర్కొనేలా సిద్ధం చేస్తామన్నారు.

Also Read: CM Chandrababu Naidu: తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పామా? నీటి పంచాయితీపై.. ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

అతిథులు వీరే..

బిగ్ అకాడమీ సంస్థలో టెక్ ఆధారిత టీచింగ్‌తో పాటు నిపుణులైన ఫ్యాకల్టీ, వ్యక్తిగత మార్గదర్శకత్వం ఉంటుందని సీఈఓ రమణ భూపతి స్పష్టం చేశారు. తద్వారా పిల్లలపై ఒత్తిడిని తగ్గించాలని బిగ్ అకాడమీ లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొన్నారు. కాగా, బిగ్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ బ్రాండ్ అంబాసిడర్ యువరాజ్ సింగ్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బిగ్ టీవీ ఫౌండర్, ఛైర్మన్ విజయ్ రెడ్డి, బిగ్ టీవీ మలయాళం ఫౌండర్ డైరెక్టర్, మేనేజింగ్ ఎడిటర్ అనిల్ అయూర్ హాజరుకానున్నారు.

Also Read: Uttam Kumar Reddy: హరీశ్‌ రావు చూపించిన లేఖను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

Just In

01

Sankranthi 2026: కళ్యాణ్ పడాల, తనూజ కలిసి డ్యాన్స్.. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఈ వేడుకలోనే!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

MP Kiran Reddy: రాయలసీమ రొయ్యలపులుసు తిన్న దొంగ ఎవరు?.. ఎంపీ చామల వ్యంగ్యాస్త్రాలు

Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

Newborn Dies: గుడిలో వదిలివేసిన శిశువు మృతి.. వైద్యులు తెలిపిన కారణాలివే