Hindu Man Killed: బంగ్లాదేశ్‌లో హిందూ జర్నలిస్ట్ హత్య
Hindu-Journalist (Image source X)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Hindu Man Killed: బయటకు పిలిచి.. సందులోకి తీసుకెళ్లి.. బంగ్లాదేశ్‌లో హిందూ జర్నలిస్ట్ హత్య

Hindu Man Killed: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల పరంపరలో మరొక దారుణ ఘటన జరిగింది. ‘బీడీ ఖబర్’ అనే పత్రిక ఎడిటర్‌, ఓ ఫ్యాక్టరీ యజమానిగా ఉన్న రాణా ప్రతాప్ అనే హిందూ వ్యక్తిని అత్యంత కిరాతకంగా (Hindu Man Killed) కాల్చిచంపారు. దుండగులు తుపాకీతో తలపై కాల్చారు. దీంతో బుల్లెట్లు తలలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత గొంతు కోసి అతి కిరాతక రీతిలో కొందరు దుండగులు చంపేశారు. బంగ్లాదేశ్‌లోని జషోర్ జిల్లాని కోపాలియా బజార్ ఏరియాలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.

బయటకు పిలిచి.. సందులోకి తీసుకెళ్లి..

రాణా ప్రతాప్ గత రెండేళ్లుగా ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. అయితే, సోమవారం సాయంత్రం కొందరు వ్యక్తులు బైక్‌పై ఆ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి ఆయనను బయటకు పిలిచారు. పక్కనే ఉన్న ఒక సందులోకి తీసుకెళ్లారు. మొదట ప్రతాప్‌తో గొడవ పడ్డారు. అనంతరం పలుమార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై పోలీసు అధికారి ఎండీ రజియుల్లా ఖాన్ స్పందించారు. ప్రతాప్ తలపై మూడుసార్లు కాల్పులు జరిపారని, గొంతు కూడా కోశారని వివరించారు. ఘటనా స్థలంలో 7 బుల్లెట్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. రాణా ప్రతాప్ గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, ఆయనకు అతివాద గ్రూపులతో సంబంధాలు ఉండవచ్చంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతాప్‌పై మీద గతంలో కేసులు ఉన్న మాట నిజమేనని, అయితే, వాటన్నింటి నుంచి ఆయన నిర్దోషిగా బయటపడ్డారని సన్నిహితులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ హత్య వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also- Sangareddy News: కరెన్సీపై గాంధీ బొమ్మను తొలగించే కుట్రలను తిప్పి కొట్టాలి: ఎంపీ సురేష్ శెట్కర్

వితంతువుపై గ్యాంగ్ అత్యాచారం

బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా ముగ్గురు హిందూ వ్యక్తుల హత్యోదంతాల తర్వాత మరో శనివారం సాయంత్రం మరో ఘోరం జరిగింది. 40 ఏళ్ల వయసున్న ఓ హిందూ వితంతువుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని ఓ చెట్టుకు కొట్టేసి జట్టును కత్తిరించారు. బంగ్లాదేశ్‌లోని ఝోనైదా జిల్లాలోని కాళీగంజ్‌లో జరిగింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ దారుణం సోమవారం వెలుగులోకి వచ్చింది. దాదాపు రెండున్నరేళ్లక్రితం కాళీగంజ్ మునిసిపాలిటీలో షాహీన్ అనే మహిళ, ఆమె సోదరుడికి చెందిన 1.2 గుంటల భూమిని బాధితురాలు కొనుగోలు చేసింది. 2 మిలియన్ టాకాలకు కొనగా, అందులో రెండంతస్తుల ఓ బిల్డింగ్ కూడా ఉంది. అయితే, కొనుగోలు పూర్తయిన ఇంతకాలం తర్వాత, విక్రయించిన వ్యక్తులు అసంబద్ధమైన ప్రతిపాదనలు చేశారు. అదనంగా డబ్బు అడిగినట్టుగా తెలుస్తోంది. అందుకు బాధితురాలు ససేమిరా అని చెప్పడంతో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారంటూ స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

బాధితురాలి పట్ల మృగాల మాదిరిగా ప్రవర్తించారు. ఒక్కసారిగా దాడికి తెగబడి బాధితురాలిని మానభంగం చేశారు. అనంతరం 50 వేల టాకాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అయితే, డబ్బు ఇవ్వలేనంటూ బాధితురాలు చెప్పడంతో మరింత కర్కశంగా ప్రవర్తించారు. బాధితురాలి బంధువులను అక్కడి నుంచి తరిమికొట్టారు. ఈ తతంగాన్ని వీడియోను తీసి వీడియోను సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేశారు. జట్టు కత్తిరించిన తర్వాత కూడా బాధితురాలిని నిందిత వ్యక్తులు టార్చర్ చేశారు. దాంతో, ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత స్థానిక వ్యక్తులు ఝెనైదా సర్దార్ హాస్పిటల్‌కు తరలించారు.

Read Also- Triple Murder Case: తల్లి, చెల్లి, తమ్ముడిని చంపేసి పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన వ్యక్తి.. ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్

 

 

Just In

01

Mahabubabad News: రసవత్తరంగా మానుకోట మునిసిపాలిటీ చైర్మన్ రేస్.. సమీకరణాలు ఇవే

Love Letters: బ్యాచ్‌లర్స్ ప్రదీప్, సుడిగాలి సుధీర్‌కు ప్రేమలేఖలు.. ఆ లేఖల్లో ఏముందంటే?

Stock Markets Fall: బాబోయ్.. ఇన్వెస్టర్లకు ఒకే రోజు రూ.8.1 లక్షల కోట్లు నష్టం.. అంతా ట్రంప్ వల్లే!

YS Jagan on Amaravati: ‘రాజధాని నిర్మాణం సాధ్యమా?’.. అమరావతిపై జగన్ సంచలన వ్యాఖ్యలు

Sobhita Dhulipala: ‘చీకటిలో’ శోభిత ధూళిపాల ఏం చేస్తుందో.. ఆ ఓటీటీలో చూడండి!