Murder Case: పల్లె ప్రకృతి వనంలో యువకుడు హత్య కలకలం
Murder Case (imagecredit:swetcha)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Murder Case: మాచర్ల పల్లె ప్రకృతి వనంలో యువకుడు హత్య కలకలం

Murder Case: గట్టు మండలం మాచర్ల గ్రామ శివారులో ఓ యువకుడి హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) గట్టు మండలం బలిగేర గ్రామానికి చెందిన ఖయ్యూం (25) ను గుర్తు తెలియని వ్యక్తులు మాచర్ల పల్లె ప్రకృతి వనానికి సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పథకం ప్రకారం హత్య చేసినట్లు కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. హత్య ఘటన సమాచారం అందుకున్న వెంటనే సిఐ, గట్టు ఎస్సై, సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Also Read: Poonam Kaur: నాకు పెళ్లయింది, పిల్లలు కూడా ఉన్నారు.. పూనమ్ కౌర్ షాకింగ్ కామెంట్స్

వ్యక్తిపై అనుమానం

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, హత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బలిగేర(Baligera) గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది. డాగ్ స్క్వాడ్(Dog squad), క్లూస్ టీం(clues team)తో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం యువకుడి మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం వారి తల్లిదండ్రులను మాచర్ల స్టేజ్ దగ్గర తీసుకురావడానికి వస్తానని తెలిపాడని, తర్వాత ఫోన్ చేస్తే ఎత్తలేదని, అబ్రహం(Abraham) అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గద్వాల సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు.

Also Read: NBK111: బాలయ్య, గోపీచంద్ మలినేని మూవీకి మార్పులు.. కారణం అదేనా?

Just In

01

SKN Comments: ఇండస్ట్రీ పెద్దలకు ఎస్కేఎన్ ఓ విన్నపం.. ‘ది రాజాసాబ్’ థియేటర్లు ఇవ్వండి..

Telangana Politics: ఆ మూడు పార్టీల్లోనూ ఇదే వైఖరి.. హద్దులు మీరుతున్న నేతల విమర్శలు!

BRS Party: గ్రామాల్లో పట్టు సడలకుండా గులాబీ నేతల విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ ఆ పార్టీ చేతికి చిక్కకుండా ప్లాన్!

Machilipatnam Crime: ‘నా కొడుకునే వదిలేస్తావా?’ అంటూ కోడలిపై కత్తితో మామ దాడి

Huzurabad: పచ్చని పొలాల్లో విషం నింపుతారా? డంపింగ్ యార్డ్ నిర్ణయంపై స్థానిక ప్రజలు ఆగ్రహం!