ప్రముఖ నటుడు సోనుసూద్ (Sonu Sood) పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. చీటింగ్ కేసులో లూథియానా కోర్టు ఆదేశించినా విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముంబయిలోని అందేరి వెస్ట్‌లో ఉన్న ఒషివారా పోలీస్‌స్టేషన్‌కు లుథియానా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ రమన్‌ప్రీత్ కౌర్ వారెంట్ జారీ చేశారు. సోనూసూద్‌ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read : మఖానా.. అంతర్జాతీయ సూపర్ ఫుడ్‌గా ఎలా మారింది?
లూథియానా ప్రాంతానికి చెందిన లాయర్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు చీటింగ్ చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్ (Sonu Sood)ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన కోర్టు నటుడు సోనూసూద్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘‘సోనుసూద్‌కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి’’ అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణ జరగనుంది.