Medak district Crime: భర్తను గొంతు బిగించి చంపిన భార్య
Medak district Crime (Image Source: Freepic)
క్రైమ్

Medak district Crime: మెదక్ జిల్లాలో ఘోరం.. భర్తను గొంతు బిగించి చంపిన భార్య

Medak district Crime: భార్త భర్తలు ఒకరినొకరు చంపుకుంటున్న ఘటనలు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు దంపతులంటే ప్రేమ, అనురాగాలకు ప్రతీకగా నిలిచేవారు. సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించేవారు. అలాంటిది ప్రస్తుత రోజుల్లో కొన్ని జంటలు ఈ బంధానికి తూట్లు పొడుస్తున్నాయి. వివాహతేర సంబంధాలు పెట్టుకొని జీవిత భాగస్వామిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకన్న భర్తను భార్య హత్య చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. 

మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్త స్వామి (35)ని భార్య మౌనిక (28) హత్య చేసింది. అంతటితో ఆగకుండా ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలకు తెరలేపింది. మద్యం మత్తులో చెరువులో పడి భర్త చనిపోయినట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే స్వామి మృతిపై అనుమానాలు వ్యక్తి చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మెదక్ జిల్లా పోలీసులు అసలు నిజాలను బయటపెట్టారు.

23 ఏళ్ల కుర్రాడితో ఎఫైర్..

స్వామి అనుమానస్పద మృతికి గల కారణాలను పోలీసులు వివరించారు. దీని ప్రకారం.. స్వామి, మౌనికలకు 12 ఏళ్ల క్రితమే వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. అయితే మౌనికకు తనకంటే తక్కువ వయసున్న సంపత్ (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయం స్వామికి తెలియడంతో మౌనికతో గొడవపడ్డాడు. పంచాయతీ పెడతానని హెచ్చరించాడు. దీంతో భర్తను ఎలాగైన చంపాలని మౌనిక నిర్ణయించుకుంది. ఇందుకోసం ప్రియుడి సాయం తీసుకుంది.

గొంతు నులిమి చంపి..

గత నెల 23న మద్యం తాగి స్వామి ఇంటికి రాగా.. భర్తను చంపేందుకు ఇదే మంచి ఛాన్స్ అని మౌనిక భావించింది. దీంతో వెంటనే ప్రియుడికి ఫోన్ చేసి.. ఇంటికి పిలిపించింది. అతడి సాయంతో భర్త స్వామి గొంతు నులిమి ప్రాణాలు తీసింది. అనంతరం ప్రియుడితో కలిసి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి నెరేళ్ల కుంటలో పడేసింది. ఆపై మద్యం మత్తులో నీటిలో పడి చనిపోయినట్లు బంధువులందరికీ సమాచారం ఇచ్చింది.

Also Read: Deputy CM Pawan Kalyan: కొండగట్టు అంజన్న సేవలో పవన్ కళ్యాణ్.. టీటీడీ వసతి గృహాలకు శంకుస్థాపన

మౌనిక, ప్రియుడు అరెస్ట్..

మౌనిక చెప్పిన మాటలను తొలుత స్వామి బంధువులు నమ్మారు. అయితే రాను రాను మౌనిక ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించారు. దీంతో స్వామి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన శైలిలో మౌనికను విచారించగా.. జరిగిందంతా ఆమె బయటపెట్టింది. భర్తను ప్రియుడితో కలిసి తానే హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో మౌనిక, సంపత్ ను పోలీసుల అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు.

Also Read: Naa Anveshana: నా అన్వేష్‌కు బిగ్ షాక్.. రంగంలోకి బీజేపీ.. దేశ ద్రోహంపై నోటీసులు!

Just In

01

Akhanda 2: బోయపాటి ఇంటిని చుట్టుముట్టిన బయ్యర్లు.. నష్టాన్ని భరించేది ఎవరు?

Big Academy – Yuvraj Singh: వైఫల్యం చెందకపోతే ఎలా గెలవాలో తెలియదు.. బిగ్ అకాడమీ లాంఛింగ్‌లో యువరాజ్ సందేశం

HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం

Son after 10 Daughters: బాబోయ్.. వరుసగా 10 మంది కూతుళ్లు.. 11వ సంతానంలో నెరవేరిన ‘కొడుకు కల’

ACB Rides: ఏసీబీ వలలో చిక్కిన నాగిరెడ్డి పేట తహసీల్దార్