China Official: రూ.38 వేల కోట్లు.. అవినీతిలో ట్రెండ్ సెట్టర్ భయ్యా!
China Official (Image Source: Twitter)
అంతర్జాతీయం

China Official: 13.5 టన్నుల బంగారం.. 23 టన్నుల నగదు.. అవినీతిలో ట్రెండ్ సెట్టర్ భయ్యా!

China Official: ప్రస్తుత రోజుల్లో అవినీతి అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా కొందరు అధికారులు ప్రజలను దోచుకుంటున్న ఉదంతాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో, కోట్లల్లో కూడబెట్టిన రాజకీయ నాయకులు మన కళ్లేదుట కనిపిస్తూనే ఉన్నారు. అయితే వారంతా రూ. కోట్ల నుంచి రూ.వందల కోట్ల వరకూ అవినీతి చేస్తే.. ఓ వ్యక్తి ఏకంగా రూ. వేల కోట్ల రూపాయల కరప్షన్ కు పాల్పడ్డారు. తద్వారా టన్నుల కొద్ది బంగారం, డబ్బు, విలాస భవనాలను సంపాదించాడు. కరప్షన్ లో ప్రపంచానికే తానూ ట్రెండ్ అన్న తరహాలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

వివరాల్లోకి వెళ్తే..

చైనాలో ప్రపంచంలోనే అతి భారీ అవినీతి తిమింగలం బయటపడింది. హైహౌ (Haihou) నగర మాజీ మేయర్ జాంగ్ క్యూ కు అవినీతి కేసులో మరణశిక్ష పడటంతో అతడు చేసిన దోపిడిలు యావత్ ప్రపంచానికి తెలిశాయి. జాంగ్ క్యూపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు రావడంతో తొలుత అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. అక్కడ బయటపడ్డ సంపద చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

టన్నులకొద్ది బంగారం..

జాంగ్ క్యూ కు చెందిన ఓ అపార్ట్ మెంట్ లో దాడి చేసిన అవినీతి నిరోధక అధికారులు.. భారీ ఎత్తున బంగారం, డబ్బు, విలాస భవనాలకు సంబంధించిన డాక్యుమెంట్లను గుర్తించారు. మెుత్తంగా 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల నగదును ఈ సోదాల్లో గుర్తించినట్లు చైనా అధికారులు ప్రకటించారు. ప్రభుత్వ భూ ఒప్పందాలు, కాంట్రాక్టుల ద్వారా బిలియన్ డాలర్ల మేర లంచాలు పొందినట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.

పదేళ్లలోనే భారీ అవినీతి..

దర్యాప్తు అధికారుల ప్రకారం.. హైహౌ నగరానికి 2009-19 మధ్య జాంగ్ క్యూ మేయర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో భారీగా అక్రమ సంపాదనకు తెరలేపాడు. ఈ పదేళ్లలో ఏకంగా 4.3 బిలియన్ డాలర్ల సంపదను అక్రమంగా కూడబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ.35,690 కోట్లకు సమానం.

Also Read: Alleti Maheshwar Reddy: టూ వీలర్ పై పన్నులు పెంచడం దుర్మార్గం.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి!

మరణ శిక్ష విధింపు..

ఇదిలా ఉంటే అవినీతి ఆరోపణలపై జాంగ్ క్యూని అరెస్టు చేసిన చైనా పోలీసులు.. అనంతరం అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అక్రమాలకు సంబంధించిన పక్కా ఆధారాలను కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం.. జాంగ్ క్యూ మేయర్ గా తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ధ్రువీకరించింది. చైనా చరిత్రలోనే అతిపెద్ద, అత్యంత వివాదస్పద అవినీతి కేసుగా దీనిని అభివర్ణించింది. ఇలాంటి కరప్షన్ మళ్లీ చేసేందుకు ఏ అధికారి ధైర్యం చేయడకూడదన్న ఉద్దేశ్యంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. త్వరలోనే జాంగ్ క్యూను ఉరితీసే అవకాశముంది.

Also Read: Bhatti Vikramarka: బీజేపీలోని ఏ ఒక్క‌నాయ‌కుడైనా దేశం కోసం త్యాగం చేశారా? : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!

Just In

01

India ODI Squad: కెప్టెన్‌గా గిల్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటించిన బీసీసీఐ

Shivaji Controversy: హీరోయిన్ దుస్తుల వివాదంపై సుమన్ చెప్పింది ఇదే.. వారు ఏం చేసేవారంటే?

RBI on Rs 2,000 Note: మీ వద్ద రూ.2000 నోట్లు ఉన్నాయా? ఇలా మార్చుకోండి.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

The RajaSaab: ఎన్టీఆర్ వివాదంపై అసలు విషయాలు చెప్పిన దర్శకుడు మారుతి.. ఎందుకు చేశారంటే?

Gold Silver Prices: బాబోయ్… వెనిజులాపై అమెరికా దాడితో బంగారం, వెండి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయా?