PhD on Nifty 50: డాక్టరేట్ అవార్డుకు అర్హత సాధించిన శ్రీనివాస్ రావు
ఎక్స్‌ప్లెయినబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఫ్టీ-50 ధరల అంచనాలపై పరిశోధన
ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో జరిగిన వైవా పరీక్షలో ఉత్తీర్ణత
గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ స్థాయి పరిశోధకుడిగా ఎదిగి, యువతకు స్ఫూర్తి
అశ్వారావుపేట,స్వేచ్ఛ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట గ్రామీణ నేపథ్యం నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగిన శ్రీనివాస్ రావు చీకటి అనే తెలుగు వ్యక్తి పీహెచ్‌డీ పరిశోధనలో (PhD on Nifty 50) ఉత్తీర్ణులయ్యారు. “A Novel Approach for Predicting NIFTY 50 Price Movements by Leveraging Explainable Artificial Intelligence” అనే అంశంపై నిర్వహించిన వైవా పరీక్షలో పాసయ్యి, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీకు (Ph.D) అర్హత సాధించారు. అనురాగ్ యూనివర్సిటీ పరిశోధన స్కాలర్‌గా ఉన్న ఆయన, యూనివర్సిటీ అకడమిక్ అండ్ ప్లానింగ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ కె. సుధీర్ రెడ్డి పర్యవేక్షణలో పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. గత నెల 29న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) భువనేశ్వర్‌కు చెందిన ప్రముఖ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైవా వోస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ప్యానెల్ సభ్యుల సిఫారసుల మేరకు శ్రీనివాస్ రావుకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ప్రదానం చేయనున్నట్లు పర్యవేక్షకులు తెలిపారు.
Read Also- Lady Constable: లేడీ కానిస్టేబుల్ దుస్తులు చింపేసిన నిరసనకారులు.. షాకింగ్ వీడియో వైరల్
సాధారణ కుటుంబ నేపథ్యంతో విద్యకు పరిమిత వనరులే ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో పెరిగిన శ్రీనివాస్ రావు, కష్టపడి చదివి ఉన్నత విద్యలో రాణించడం ఆ గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆధునిక సాంకేతికత, కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) వంటి అత్యాధునిక అంశాలను పరిశోధనలో ఉపయోగించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
డాక్టరేట్ దక్కిన నేపథ్యంలో శ్రీనివాస్ రావు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం, పర్యవేక్షకుల సహకారం ముఖ్యకారణాలని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అవకాశాలు లేవని నిరుత్సాహపడకూడదని, కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యమేనని ఆయన సూచన చేశారు. తన పరిశోధన భవిష్యత్తులో ఆర్థిక రంగానికి ఉపయోగపడుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రావు సాధించిన ఈ ఘనతపై ఆయన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మిత్రులు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read Also- Chamala Kiran Kumar Reddy: యూరియా సరఫరా విషయంలో కేటీఆర్ విమర్శలు ఫేక్: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

