పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో 2022లో వచ్చి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది ‘లైగర్’ మూవీ. ఈ సినిమాలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), అనన్య పాండే (Ananya Pandey) హీరో హీరోయిన్లుగా నటించారు. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేయలేదు. అయితే తాజాగా ఈ మూవీపై అనన్య పాండే తండ్రి చంకీపాండే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో యాక్ట్ చేయడం అనన్యకు ఏమాత్రం ఇష్టం లేదని, కాకపోతే తన వల్లే ఆమె ఇందులో నటించిందని అన్నారు.
‘‘అనన్య పాండే (Ananya Pandey)కి ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు తను ఎంతో అసౌకర్యంగా ఫీలైంది. గందరగోళానికి గురైంది. హీరోయిన్ పాత్రకు సెట్ కానని.. చిన్న పిల్లలా కనిపిస్తానని తను అనుకుంది. దాంతో నా వద్దకు వచ్చింది. ‘‘నాన్నా.. ఈ సినిమాకు నేను సెట్ కాననిపిస్తుంది. ఏం చేయమంటావు?’’ అని అడిగింది. భారీ నిర్మాణ సంస్థ కాబట్టి ఇలాంటి ప్రాజెక్టుల్లో నటిస్తే మంచి పేరు వస్తుందని అమెను ఒప్పించానన్నారు. సినిమా విడుదలయ్యాక వచ్చిన విశ్లేషణలు చూసి.. తను చెప్పింది నిజమేననిపించింది. నిజంగానే ఆ పాత్రకు అనన్య చాలా యంగ్‌గా అనిపించింది. ‘లైగర్’ చిత్రం తర్వాత అనన్యకు సినిమాల విషయంలో ఏనాడూ సలహాలు, సూచనలు ఇవ్వలేదని అన్నారు. ప్రాజెక్ట్‌ల విషయంలో పూర్తి నిర్ణయం తనపైనే ఉంచాను. ప్రస్తుతం తనకు నచ్చిన ప్రాజెక్ట్‌లు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకుసాగుతుంది’’ అని చంకీ పాండే తెలిపారు.