Switzerland: న్యూయర్ వేడుకల్లో భారీ పేలుడు.. పలువురు మృతి
Switzerland (Image Source: twitter)
అంతర్జాతీయం

Switzerland: న్యూయర్ వేడుకల్లో భారీ పేలుడు.. ఎగసిపడ్డ మంటలు.. చెల్లాచెదురుగా మృతదేహాలు

Switzerland: స్విట్జర్లాండ్ (Switzerland)లో న్యూయర్ వేడుకల సందర్భంగా భారీ పేలుడు సంభవించింది. క్రాన్స్ మోంటానా (Crans Montana) ప్రాంతంలోని ఓ బార్ లో కొత్త ఏడాది వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగసిబడ్డాయి. ఈ ఘటనలో పలువురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ వారిని హుటాహుటీనా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

నిత్యం రద్దీగా ఉండే లే కాన్స్టెలేషన్ (Le Constellation) బార్ లో ఈ పేలుడు చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారి గేటన్ లాథియన్ (Gaetan Lathion) తెలిపారు. న్యూయర్ వేడుకల సందర్భంగా ఈ బార్ మరింత రద్దీగా మారిందని పేర్కొన్నారు. అందరూ కొత్త ఏడాది వేడుకల్లో మునిగి ఉండగా.. తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు పోలీసు అధికారి స్పష్టం చేశారు. దీంతో భయంతో పలువురు బయటకు పరిగెత్తారని మరికొందరు.. పేలుడులో చనిపోయారని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎంతమంది చనిపోయారన్న దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదని సదరు అధికారి స్థానిక మీడియాకు తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

Also Read: New Year 2026: తెలుగు రాష్ట్రాల్లో న్యూయర్ జోష్.. విషెస్ చెప్పిన సీఎంలు.. ప్రధాని మోదీ సైతం..

క్రాన్స్ మోంటానా ప్రాంతం.. స్విట్జర్లాండ్ లో మంచి టూరిస్ట్ స్పాట్ గా ఉంది. ఆల్ఫ్స్ పర్వతాలకు నడిబొడ్డున ఈ స్కి రిసార్ట్ పట్టణం (Ski Resort Town) ఉంది. దీంతో న్యూయర్ వేడుకలను జరుపుకునేందుకు పెద్ద పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివచ్చారు. స్థానికంగా ఎంతో ప్రసిద్ధి చెందిన లే కాన్స్టెలేషన్ బార్ లో కొత్త ఏడాది వేడుకల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో పేలుడు జరగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే పేలుడు కారణం ఏంటన్న విషయం ఇంకా తెలియరాలేదు. బార్ లోని గ్యాస్ సిలిండర్ ఏమైనా పేలిందా? లేదా ఉగ్రదాడి జరిగిందా? అన్న కోణంలో స్విట్జర్లాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana Tourism: తెలంగాణలో మరో సంచలన అధ్యాయం.. 2026 లో పర్యాటక రంగం లక్ష్యాలు ఇవే..!

Just In

01

Damodar Rajanarasimha: రాష్ట్రంలో కొత్త ఏడాదిలో‌ 4 కొత్త హాస్పిటల్స్: మంత్రి దామోదర రాజనర్సింహ

2026 Assembly Elections: ఫుల్ పొలిటికల్ హీట్.. 2026లో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఇవే

Kingdom Sequel Cancelled: ‘కింగ్డమ్ 2’ ఇక ఉండదంటూ వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత..

Vande Bharat Sleeper: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జనవరిలోనే వందే భారత్ స్లీపర్ సేవలు.. కేంద్రం ప్రకటన

India Bullet Train: దేశంలో బుల్లెట్ రైలు కల నెరవేరబోతోంది.. ప్రారంభం తేదీని ఖరారు చేసిన కేంద్రం