Drug Safety: హైడోస్ మందులపై కేంద్రం ఆంక్షలు
Drugs ( Image Source: Twitter)
జాతీయం

Drug Safety: రోగుల భద్రతే లక్ష్యం.. అధిక మోతాదు నైమిసులైడ్ హైడోస్ మందులపై కేంద్రం నిషేధం

Drug Safety: ప్రజారోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 100 మిల్లీగ్రాములకు పైగా మోతాదు ఉన్న నైమిసులైడ్ కలిగిన అన్ని మౌఖిక (ఓరల్) నొప్పి, జ్వర నివారణ ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీపై నిషేధం విధిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది.

డిసెంబర్ 29, 2025 తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, 1940లోని సెక్షన్ 26A కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ముందు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డుతో సంప్రదింపులు జరిపినట్లు ప్రభుత్వం తెలిపింది.

Also Read: Govt Land Scam: గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ భూమి కబ్జా.. కాలనీ పేరుతో లే అవుట్.. కోట్ల విలువైన భూమికి కన్నం!

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనలో, “ 100 మి.గ్రా.కు మించిన మోతాదులో ఉన్న నైమిసులైడ్ ఓరల్ ఫార్ములేషన్ల వినియోగం మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశముంది. అంతేకాదు, మరింత భద్రమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయి” అని స్పష్టం చేసింది.

Also Read: Hyderabad Vijayawada Train: హైదరాబాద్-విజయవాడ ట్రైన్ జర్నీ 3 గంటలే!.. దక్షిణమధ్య రైల్వే అదిరిపోయే ప్రతిపాదన

నైమిసులైడ్ ఒక నాన్-స్టెరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్ (NSAID). అయితే, ఇది కాలేయంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉందనే కారణాలతో గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న తాజా నిర్ణయం, ఔషధ భద్రత ప్రమాణాలను కఠినతరం చేయాలనే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ నిషేధం మనుషుల వినియోగానికి సంబంధించిన తయారీ, విక్రయం, పంపిణీకి మాత్రమే వర్తిస్తుంది. తక్కువ మోతాదు నైమిసులైడ్ ఫార్ములేషన్లు, అలాగే ఇతర చికిత్సాత్మక ప్రత్యామ్నాయ మందులు మార్కెట్‌లో అందుబాటులో కొనసాగుతాయి.

నైమిసులైడ్ ఆధారిత బ్రాండ్లను మార్కెట్ చేస్తున్న ఔషధ సంస్థలు తక్షణమే ఉత్పత్తిని నిలిపివేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తయారైన అధిక మోతాదు బ్యాచ్‌లను రీకాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద ఔషధ కంపెనీలపై ఈ నిర్ణయంతో ఆర్థిక ప్రభావం స్వల్పంగానే ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, నైమిసులైడ్ అమ్మకాలపై ఎక్కువగా ఆధారపడిన చిన్న ఫార్మా కంపెనీలకు మాత్రం ఆదాయపరమైన ఒత్తిడి ఏర్పడే అవకాశముంది.

Also Read: Baba Vangas 2026 Prediction: 2026లో ఈ రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం పక్కా అంటున్న బాబా వంగా.. మీ రాశి ఉందా?

ఇంతకుముందు కూడా ప్రజారోగ్య పరిరక్షణ కోసం సెక్షన్ 26A కింద అనేక ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లు, అధిక ప్రమాదకర ఔషధాలను ప్రభుత్వం నిషేధించింది. తాజా నిర్ణయం, ఔషధ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య కఠిన ఫార్మకోవిజిలెన్స్‌కు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంగా తెలియజేస్తోంది.

Just In

01

Road Widening: ఏండ్లు గడుస్తున్నా రోడ్డు విస్తరణకు కలగని మోక్షం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం..!

Vande Bharat sleeper: 180 కి.మీ వేగంతో.. వందే భారత్ స్లీపర్ పరుగులు.. కానీ ఒక్క చుక్క కిందపడలే..!

Faridabad Crime: మహిళ భద్రతపై మళ్లీ ప్రశ్నలు.. ఫరీదాబాద్‌లో లిఫ్ట్ పేరిట అత్యాచారం

Nayanthara Toxic: యష్ ‘టాక్సిక్’ నుంచి నయనతార లుక్ వచ్చేసింది.. ఏలా కనిపిస్తుందంటే?

Shivaji Statue: రాయపర్తిలో కలకలం.. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు