UP Rampur Accident: ఉత్తర్ ప్రదేశ్ లో భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. రాంపూర్ జిల్లాలో ఓ బొలేరో వాహనంపై అధిక లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో లారీలోని చెక్క పొట్టు మెుత్తం ఒక్కసారిగా బొలేరో వాహనాన్ని కప్పేసింది. ఈ ఘటనలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘోరమైన యాక్సిడెంట్ కు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే..
ఆదివారం సాయంత్రం రాంపూర్ – నైనిటాల్ హైవేపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పహాడీ గేట్ చౌరస్తా వద్ద ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. రోడ్డుపై వస్తున్న బొలెరో వాహనం మలుపు తీసుకునేందుకు యత్నించింది. బొలెరో డ్రైవర్ నెమ్మదిగా కూడి వైపు మలుపు తీసుకునేందుకు యత్నించాడు. అదే సమయంలో అటుగా హెవీ లోడ్ తో వస్తున్న లారీ డ్రైవర్.. సకాలంలో బ్రేకులు వేయలేకపోయాడు. బొలేరోను తప్పించే క్రమంలో డివైడర్ ను ఎక్కించాడు. దీంతో హెవీ లోడ్ తో ఉన్న ట్రక్ బొలేరో వాహనం వైపునకు ఒరిగి కుప్పకూలింది.
నుజ్జు నుజ్జు అయిన బొలెరో..
చెక్కపొట్టుతో వెళ్తున్న భారీ లారీ ఒక్కసారిగా బొలేరోపై పడటంతో అందరూ చూస్తుండగానే అది నుజ్జు నుజ్జు అయ్యింది. లారీలోని చెక్కపొట్టు మెుత్తం ఒక్కసారిగా బొలెరోను కమ్మేసింది. స్థానిక వార్తా కథనం ప్రకారం ప్రమాదానికి గురైన బొలెరో.. విద్యుత్ శాఖకు చెందిన సబ్ డివిజినల్ ఆఫీసర్ ది అని తెలుస్తోంది. డ్రైవర్ ఆయన్ను సబ్ స్టేషన్ వద్ద దించి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Also Read: Bank Loan News: ఓ వ్యక్తి రూ.1.7 కోట్ల లోన్ తీసుకుంటే 11 ఏళ్లలో రూ.147 కోట్లకు పెరిగింది.. ఎందుకంటే?
భారీగా ట్రాఫిక్ జామ్..
రాంపూర్ – నైనిటాల్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీనా ఘటనాస్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ట్రక్ కింద పడి నుజ్జునుజ్జు అయిన బొలెరో వాహనాన్ని క్రేన్ సాయంతో బయటకు తీశారు. రోడ్డుపై పడ్డ చెక్కపొట్టును తొలగించే వరకూ వాహనాలు కిలోమీటర్ల పొడవున రోడ్డుపైన నిలిచిపోయాయి.
Freak accident in Rampur, UP. The truck overturns into the Electricity Department's SDO vehicle. Driver dies. #Truck #Rampur #Bolero pic.twitter.com/eUAWKYjjZk
— Amarjit (@amarjit4411) December 29, 2025

