Hanumakonda District: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడు గ్రామంలో కన్నీటి దృశ్యాలు కనిపించాయి. గ్రామానికి చెందిన జక్కుల వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబం అగాధ విషాదంలో మునిగింది. పుట్టుకతోనే వికలాంగుడైన ఆయన కుమారుడు జక్కుల విజేందర్(Vijender)కు తండ్రి మృతితో జీవితం మరింత కఠినంగా మారింది. తండ్రి అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే ఆర్థిక స్థోమత లేక చివరకు గ్రామస్తుల సాయాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్
కుమారుడు కార్చిన కన్నీళ్లు
విజేందర్ వేదనను తెలుసుకున్న గ్రామస్తులు మానవత్వాన్ని చాటుకున్నారు. తమ వంతు సహకారం అందించి జక్కుల వెంకటయ్య అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించారు. తండ్రి చితి ముందు నిలబడి కుమారుడు కార్చిన కన్నీళ్లు అక్కడున్న వారందరి హృదయాలను కదిలించాయి. తండ్రి చివరి ప్రయాణానికి అయినా గౌరవం దక్కింది అంటూ విజేందర్ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ సంఘటన గ్రామంలోనే కాదు సమాజమంతటినీ ఆలోచింపజేసేలా మారింది. పేదరికం వికలాంగత్వం మధ్య నలిగిపోతున్న ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు దాతలు అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Also Read: Plane Crash: ఆకాశంలో బ్యానర్ ప్రదర్శిస్తూ సముద్రంలో కూలిన విమానం..

