MLC Kavitha: చెంచులతో మమేకమైన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha (imagecredit:twitter)
మహబూబ్ నగర్

MLC Kavitha: గిరిజన తండాలో బస.. చెంచులతో మమేకమైన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: నాగర్ కర్నూల్ జిల్లా జాగృతి జనంబాట కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దగ్గరి నుంచి పరిశీలించారు. జనంబాట మొదటి రోజు పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత శనివారం రాత్రి కల్వకుర్తి నియోజకవర్గంలోని సాలార్ పూర్ తండాలో కవిత బస చేశారు. సాలార్ పూర్ లోని గిరిజనులతో కలిసి సేవాలాల్ ఆలయంలో పూజలు చేసిన కవిత అనంతరం గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు.. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకు ముందు కొల్లాపూర్ లోని ఎరుకల వాడకు వెళ్లి వారితో మమేకం అయ్యారు.

Also Read: CM Chandrababu: అయోధ్య రామయ్య సన్నిధిలో ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రత్యేక పూజలు

చెంచులతో మమేకం

నాగర్ కర్నూల్ జిల్లా పర్యటన లో రెండో రోజు ఆదివారం అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోని అప్పాపూర్ చెంచు పెంటను సందర్శించారు. ఈ సందర్భంగా చెంచుల ఆవాసాలకు వెళ్లి వారి జీవన స్థితిగతులను పరిశీలించారు. రెండు గంటలకుపైగా చెంచులతో కలిసి ఉన్నారు. కనీసం రోడ్డు, ఇతర సౌకర్యాలు లేని చెంచు పెంటలో అత్యవసర సమయాల్లో చెంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. నల్లమలలోని చెంచులను కాపాడడానికి జాగృతి కృషి చేస్తుందని.. నల్లమలలో మైనింగ్ కు వ్యతిరేకంగా ఉద్యమించిందని గుర్తు చేశారు. భవిష్యత్ లోనూ చెంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Also Read: Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్

Just In

01

Telangana Assembly 2025: సీఎం రేవంత్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చి.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కేసీఆర్

RSS Mohan Bhagwat: సమస్యల పరిష్కారం కేవలం చర్చలతో సాధ్యం కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Apple AirPods : యాపిల్ ఎయిర్‌పాడ్స్‌కు కలర్ వెర్షన్ వస్తుందా?

CM Revanth Reddy: పాలమూరు ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయండి: సీఎం రేవంత్ రెడ్డి

Elon Musk: కెనడా వైద్యుల నిర్లక్ష్యం.. భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలు