Thalapathy Vijay: సినిమాలకు ఇక గుడ్‌బై -దళపతి విజయ్
Thalapathy Vijay (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Thalapathy Vijay: సినిమాలకు గుడ్‌బై.. అధికారికంగా ప్రకటించిన దళపతి విజయ్

Thalapathy Vijay: ఇప్పటి వరకు దళపతి విజయ్‌కి సంబంధించి ‘జననాయగన్’ చిత్రం ఆయన ఆఖరి చిత్రంగా వార్తలు వినిపించాయి. కోలీవుడ్ మొత్తం ఇదే చెబుతూ వస్తుంది. కానీ, విజయ్ నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో, టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌లా ఆయన కూడా సినిమాలు చేస్తూ పాలిటిక్స్ రన్ చేస్తారని ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు. కానీ, అభిమానుల ఆశలకు బ్రేక్ వేస్తూ.. విజయ్ కూడా తన రిటైర్‌మెంట్‌ని అధికారికంగా, పబ్లిగ్గా చెప్పేశారు. ‘జననాయగన్’ (Jana Nayagan) తన చివరి సినిమా అని చెప్పి స్వయంగా విజయే చెప్పారు. తాజాగా కౌలాలంపూర్‌లో జరిగిన ‘జననాయగన్’ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో విజయ్ (Thalapathy Vijay) ఎమోషనల్‌గా మాట్లాడారు. ఇప్పటి వరకు సినిమాలు ఆదరించి గొప్ప స్టేటస్ ఇచ్చారు.. ఇకపై అభిమానులకు సేవ చేసుకోవడానికి 30 సంవత్సరాలు కేటాయించాలని భావిస్తూ, సినిమాలకు దూరమవుతున్నానని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు షాకవుతున్నారు.

Also Read- O Andala Rakshasi: నేటితరం ఆడపిల్లలు ఎలా ఉండాలో ‘ఓ అందాల రాక్షసి’ చెబుతుందట!

ప్రజా సేవకు 30 సంవత్సరాలు

ఇంతకీ విజయ్ ఏమన్నారంటే.. నటుడిగా నాకు ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చారు. ఎంతో మంది నా సినిమాలను చూసేందుకు థియేటర్లకు వచ్చారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొని నటుడిగా ఈ స్థానంలో ఉన్నానంటే కారణం అభిమానులు, ప్రేక్షకులు చూపిన ఆదరణే. దాదాపు 33 సంవత్సరాలుగా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. చిన్న ఇల్లు కట్టుకోవాలని వచ్చిన నాకు, పెద్ద రాజ భవనమే ఇచ్చి, మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఇంత అభిమానం చూపిన వారి కోసం నేను నిలబడాలని అనుకుంటున్నాను. అందుకే అభిమానులకు, ప్రేక్షకులకు సేవ చేసుకోవడానికి 30 సంవత్సరాలు కేటాయిస్తూ.. సినిమాలకు దూరమవుతున్నాను. ఇన్నాళ్లు నాకు సపోర్ట్‌గా నిలిచిన వారికి ఇకపై నేను సపోర్ట్‌గా నిలబడతానని విజయ్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

Also Read- Huma Qureshi as Elizabeth: యష్ ‘టాక్సిక్’ సామ్రాజ్యంలో ‘ఎలిజబెత్’గా హుమా ఖురేషి.. పోస్టర్ పీక్స్..

ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు

ఇంకా విజయ్ మాట్లాడుతూ.. అభిమానులకు ఈ సందర్భంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం జీవితంలో సక్సెస్ సాధించాలంటే పక్కన స్నేహితులే కాదు, దూరంగా ఉన్నా ఒక బలమైన శత్రువు కూడా ఉండాలి. నీ శత్రువు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే, నువ్వంత గొప్పగా సక్సెస్ సాధించగలవు. అందరికీ సాయం చేసే గుణం ఉండాలి. ఇప్పుడు చిన్న సాయం చేస్తే.. భవిష్యత్‌లో అది మీకు ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది. దయచేసి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దని తెలిపారు. ‘జననాయగన్’ గురించి మాట్లాడుతూ.. సంగీత దర్శకుడు అనిరుధ్‌, దర్శకుడు హెచ్. వినోద్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా అనిరుధ్‌ని ‘మ్యూజికల్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌’ అని పిలుస్తుంటానని అన్నారు. అలాగే హెచ్‌. వినోద్‌ సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడని కొనియాడారు. ఈ సినిమాలో మమితా బైజు పాత్ర అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ‘ఘిల్లి’ (2004) సినిమా నుంచి ప్రకాష్ రాజ్‌తో జర్నీ కొనసాగుతుందని, ఇందులో ఆయన చాలా మంచి పాత్ర పోషించారని తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Director Maruthi: మొన్న అన్ని నీతులు చెప్పావ్.. ఇదేంటి మారుతి?

Etela Rajender: నేను సీరియస్ పొలిటీషియన్.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్

Aadi Saikumar: ‘శంబాల’ సక్సెస్ జోష్‌.. హిట్ బ్యానర్‌లో ఆదికి బంపరాఫర్!

Assembly Session KCR: అసెంబ్లీకి కేసీఆర్!.. ఎర్రవెల్లి నుంచి నందినగర్ చేరుకున్న మాజీ సీఎం

TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు.. కీలక పదవులు వీరికే!