Huma Qureshi as Elizabeth: యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషి ‘ఎలిజబెత్’ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హీరో యశ్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Read also-RGV Shivaji: శివాజీ మాటలకు ఆర్జీవీ ఫైర్ అవ్వడానికి కారణం ఇదే?.. ఇద్దరికీ తేడా ఏంటి?
హుమా ఖురేషి ‘ఎలిజబెత్’ ఫస్ట్ లుక్
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో హుమా ఖురేషి అత్యంత శక్తివంతమైన, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. నలుపు రంగు దుస్తులు ధరించి, 90వ దశకం నాటి ఒక వింటేజ్ కార్ ముందు ఆమె నిలబడి ఉన్న తీరు ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్ నేపథ్యం అంతా ఒక శ్మశాన వాటికలా, పాతబడిన సమాధులు మరియు విగ్రహాలతో నిండి ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఆమె పాత్రలోని నెగటివ్ షేడ్స్‌ను సూచిస్తోంది. ముఖ్యంగా ఆమె ముఖంలోని ప్రశాంతత వెనుక ఏదో పెద్ద ప్రమాదం దాగి ఉందనే భావన కలుగుతోంది.
‘టాక్సిక్’ చిత్రంలో హుమా ఖురేషితో పాటు పలువురు అగ్ర కథానాయికలు నటిస్తున్నారు. అందులో ముఖ్యంగా కియారా అద్వానీ ఉన్నారు. ఈమె ‘నాడియా’ అనే పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈమె లుక్ సర్కస్ బ్యాక్‌డ్రాప్‌లో వైవిధ్యంగా ఉంది. ఆమెతో పాటు.. నయనతార కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నయనతార కనిపించనున్నారు. రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి తారలు కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు సమాచారం.
Read also-RajaSaab SKN: ట్రైలర్ వచ్చాకా ట్రోలింగ్స్ ఉండవ్.. రెబల్ రూలింగ్సే.. ఎస్‌కేఎన్..
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని ఒక పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్ ఉన్న కథగా ఇది ఉండబోతోంది. యశ్ తన ‘కేజీఎఫ్’ ఇమేజ్‌కు భిన్నంగా ఈ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్నారని చిత్ర బృందం పేర్కొంది. కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, పాన్-ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం హిందీ భాషల్లో విడుదల కానుంది. 2026 మార్చి 19న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హుమా ఖురేషి లుక్ చూసిన అభిమానులు, ఆమె పాత్ర ఎంతటి అంచనాలకు మించి ఉండబోతుందోనని చర్చించుకుంటున్నారు.
Introducing Huma Qureshi @humasqureshi as ELIZABETH in – A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXIConMarch19th #TOXICTheMovie @thenameisyash @advani_kiara #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar… pic.twitter.com/csJhb7Jxyy
— KVN Productions (@KvnProductions) December 28, 2025

