RGV Shivaji: ఇటీవల ఒక బహిరంగ వేదికపై నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందిస్తూ శివాజీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శివాజీ మాటల వెనుక ఉన్న పితృస్వామ్య భావజాలాన్ని వర్మ ఎండగట్టారు.
నిర్భయ నిందితుడి మైండ్‌సెట్‌తో పోలిక
శివాజీ వ్యాఖ్యలను విశ్లేషిస్తూ వర్మ ఒక సంచలన పోలికను తెరపైకి తెచ్చారు. “నిర్భయ కేసులో నిందితుడు జైలులో ఉండి ఏ మాటలైతే మాట్లాడాడో, ఇప్పుడు శివాజీ కూడా దాదాపు అవే మాటలు మాట్లాడుతున్నాడు” అని వర్మ ధ్వజమెత్తారు. ఒక మహిళ వేసుకునే దుస్తుల వల్లే అఘాయిత్యాలు జరుగుతాయని చెప్పడం అత్యంత ప్రమాదకరమైన ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. నేరం చేసే వాడిని వదిలేసి, బాధితురాలి బట్టలను తప్పు పట్టడం నేరస్థుడి మనస్తత్వానికి నిదర్శనమని వర్మ ఘాటుగా విమర్శించారు.
Read also-Chiranjeevi Anil: ‘మన శంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో పోస్టర్ రిలీజ్.. ఇంకా పదిహేను రోజులే..
భాషపై అభ్యంతరం
శివాజీ తన ప్రసంగంలో ‘సామా*’, ‘దరిద్ర* **డ’ వంటి పదజాలాన్ని ఉపయోగించడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించాల్సిన చోట, వారిని వస్తువులతో పోల్చడం (Objectification) వారిని కించపరచడమేనని అన్నారు. “అలా పిలవడం అంటే మహిళలను కేవలం ఒక భౌతిక వస్తువుగా మాత్రమే చూడటం. ఇది వారి వ్యక్తిత్వాన్ని డీగ్రేడ్ చేయడమే” అని వర్మ విశ్లేషించారు. సమాజంలో వేళ్లూనుకున్న పితృస్వామ్య అహంకారం ఇలాంటి మాటల రూపంలో బయటకు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read also-RajaSaab Prabhas: 15 ఏళ్ల తర్వాత వస్తున్నా.. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు.. ప్రభాస్..
మద్దతుగా నిలిచిన నెటిజన్లు
దుస్తుల ఎంపిక అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, దానిపై నీతులు చెప్పే అధికారం ఎవరికీ లేదని వర్మ స్పష్టం చేశారు. ఒక హీరో సిక్స్ ప్యాక్ చూపిస్తే రాని అభ్యంతరం, ఒక నటి గ్లామరస్‌గా కనిపిస్తే ఎందుకు వస్తుందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం మహిళలను అణచివేయాలనే కుట్రలో భాగమని పేర్కొన్నారు. ఎక్కడైనా బూతులు ఆడవారిమీదే ఉంటాయి కానీ ఒక్క మగాడి మీద కూడా ఎక్కడా బూతులు ఉండవని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా శివాజీ వాడిన భాషను తప్పుపడుతూ, మహిళల పట్ల గౌరవం ఉండాలని అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని పలువురు విమర్శిస్తున్నారు. ఇలాంటి సందర్భాలు వచ్చినపుడు చిన్మయి, అనసూయ లాంటి వారు ఏమీ చేయకుండా ఉంటేనే మంచిదన్నారు. మీరు ఏనుగు అనుకోండి మీ ముందు ఓ కుక్క మోరుగుతోంది. అనుకోండి అంటూ అలాంటి వారికి సలహా ఇచ్చారు.

