RajaSaab Prabhas: 15 ఏళ్ల తర్వాత వస్తున్నా.. ప్రభాస్..
the-rajasab-prabhas
ఎంటర్‌టైన్‌మెంట్

RajaSaab Prabhas: 15 ఏళ్ల తర్వాత వస్తున్నా.. క్లైమాక్స్ ఎవరూ ఊహించలేరు.. ప్రభాస్..

RajaSaab Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అభిమానుల కేరింతలు, ప్రభాస్ ఉత్సాహభరితమైన మాటల మధ్య అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ వేదికపై ప్రభాస్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ వేదికపైకి రాగానే అభిమానులను తనదైన శైలిలో “డార్లింగ్స్” అని సంబోధిస్తూ ఉత్సాహపరిచారు. తీవ్రమైన చలిలో కూడా తన కోసం వచ్చిన అభిమానుల పట్ల శ్రద్ధ చూపిస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా తన కొత్త లుక్ గురించి చెబుతూ, “మొన్న జపాన్ వెళ్ళినప్పుడు ఇలాంటివి చూశాను, అందుకే మీ కోసం ఈ ప్రత్యేకమైన దుస్తులు వేసుకున్నాను” అని సరదాగా వ్యాఖ్యానించారు.

Read also-Battle Galwan: సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టీజర్ వచ్చేసింది.. గల్వాన్ వీరుల త్యాగానికి సెల్యూట్..

మారుతి పెన్ను..  అద్భుతం

ప్రభాస్ ఈ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “చాలా కాలంగా మనం కేవలం ఫైట్లు, సీరియస్ సినిమాలు చేస్తున్నాం. అభిమానుల కోసం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని మారుతిని అడిగాను. అలా ఈ హారర్ కామెడీ సెట్ అయింది” అని చెప్పారు. ముఖ్యంగా మారుతి రాసిన క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ, తాను మారుతి రైటింగ్‌కు ఫ్యాన్ అయిపోయానని, ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక కొత్త పాయింట్‌తో క్లైమాక్స్ ఉంటుందని వెల్లడించారు.

Read also-Kalaga Kathaga: ‘ఛాంపియన్’ నుంచి మనసును మీటే మెలోడీ ‘కలగా కథగా’ లిరికల్ వీడియో వచ్చేసింది..

సంజయ్ దత్ ప్రెసెన్స్.. నాన్నమ్మ పాత్ర హైలైట్

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గురించి ప్రభాస్ గొప్పగా చెప్పారు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ అద్భుతమని, క్లోజప్ షాట్స్‌లో ఆయన నటన చూస్తుంటే అబ్బురంగా ఉంటుందని అన్నారు. ఇక సినిమాలో తన నాన్నమ్మగా నటించిన నటి గురించి చెబుతూ.. “డబ్బింగ్‌లో ఆవిడ సీన్లు చూసి నా సీన్లు మర్చిపోయాను. ఈ సినిమాలో ఆవిడ మరో హీరో” అని ప్రశంసించారు. తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ తాను పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో కనిపిస్తున్నానని ప్రభాస్ గుర్తుచేశారు. “సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వాలి, మా సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి” అని ఆకాంక్షించారు. తన స్పీచ్‌లు ఎప్పుడూ బోరింగ్‌గా ఉంటాయని అందరూ అంటుంటారని, కానీ ఏదో ఒకరోజు స్టేజ్ మీద అందరూ షాక్ అయ్యేలా పెద్ద స్పీచ్ ఇస్తానని నవ్వుతూ ముగించారు. మొత్తానికి ‘రాజా సాబ్’ తో ప్రభాస్ తన పాత ‘డార్లింగ్’ డేస్ ఎంటర్టైన్మెంట్‌ను మళ్ళీ గుర్తుకు తెస్తారని ఈ ఈవెంట్ ద్వారా స్పష్టమైంది.

Just In

01

Nara Bhuvaneshwari: కార్యకర్తల పిల్లలకు చదువు చెప్పేందుకు విద్యా సంస్థలు: నారా భువనేశ్వరి

RajaSaab SKN: ట్రైలర్ వచ్చాకా ట్రోలింగ్స్ ఉండవ్.. రెబల్ రూలింగ్సే.. ఎస్‌కేఎన్..

Palm Tree Workers: తాటి చెట్లు తొలగించిన భూ యజమానులు.. చర్యలు తీసుకోవాలని గౌడన్నలు డిమాండ్!

Crime News: బెంగళూరులో ఉంటూ డ్రగ్స్ సప్లై​ లింక్.. డ్రగ్ పెడ్లర్ల అరెస్ట్!

Ministers Visit Villages : కొత్త సంవత్సరం నుంచి గ్రామాల్లో మంత్రులు డ్రైవ్.. వరుస పర్యటనకు ప్లాన్!