Cylinder Explosion: హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు
Gas-Blast (Image soucre X)
లేటెస్ట్ న్యూస్, హైదరాబాద్

Cylinder Explosion: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. అపార్ట్‌మెంట్‌లో పేలిన గ్యాస్ సిలిండర్

Cylinder Explosion: హైదరాబాద్‌లోని (Hyderabad News) సోమాజిగూడలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా ఓ గ్యాస్ సిలిండర్ (Cylinder Explosion) పేలింది. పేలుడు ధాటికి అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వేగంగా ఘటనా స్థలానికి చేరుకొని, మంటలను అర్పివేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. సిలిండర్ పేలిన అపార్ట్‌మెంట్.. కత్రీయ హోటల్‌కు సమీపంలో ఉంది.

Read Also- KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలి.. నాగర్‌కర్నూల్‌లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున జరిగిన ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దంతో సిలిండర్ పేలడంతో, ఆ బిల్డింగ్‌లో నివసిస్తున్నవారు ఆందోళనతో వణికిపోయారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పేలుడు సంభవించిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్నికీలలు కీటికీల నుంచి బయటకు కనిపించాయి.

కాగా, అగ్నిమాపక సిబ్బంది తక్షణమ స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెనుప్రమాదం తప్పింది. మంటలు ఇతర అపార్ట్‌మెంట్లకు వ్యాపించకుండా అదుపు చేయడంతో పెనుప్రమాదం తప్పినట్టు అయ్యింది. కాగా, పేలుడు ఘటనకు సంబంధించిన మంటల దృశ్యాలను సెల్‌ఫోన్లతో చిత్రీకరించిన పలువురు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో, ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

Read Also- Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ నేతల హౌస్ అరెస్ట్.. ఓపెన్ మెరిట్ విద్యార్థుల ఆందోళనలో కొత్త మలుపు

Just In

01

Kichcha Sudeepa: ఇతర ఇండస్ట్రీ స్టార్స్‌పై సుదీప్ సంచలన వ్యాఖ్యలు

Prabhas: పాన్ ఇండియా స్టారైనా.. పబ్లిక్‌లో మాట్లాడాలంటే ఇంకా సిగ్గే!

iBomma Ravi: రవి ప్రహ్లాద్‌ని పిలిపించిన అధికారులు.. ఐ బొమ్మ రవి కేసులో కీలక అప్డేట్!

Director Maruthi: మొన్న అన్ని నీతులు చెప్పావ్.. ఇదేంటి మారుతి?

Etela Rajender: నేను సీరియస్ పొలిటీషియన్.. ఎంపీ ఈటల హాట్ కామెంట్స్