VC Sajjanar: డ్రగ్స్ ఫ్రీ న్యూ ఇయర సెలబ్రేషన్స్ ను లక్ష్యంగా పెట్టుకున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ (VC Sajjanar) చెప్పారు. దీని కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ (హెచ్ న్యూ), టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ పోలీసుల బృందాలు ఆయా హోటళ్లు, పబ్బులు, ఈవెంట్లు జరిగే చోట తనిఖీలు జరుపుతాయన్నారు. డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేస్తారన్నారు.
మాదక ద్రవ్యాలు సేవంచి ఎవరు పట్టుబడ్డా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే సమయంలో డ్రగ్స్ కు అనుమతి ఇస్తే పబ్బులు, హోటళ్ల లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ఈవెంట్లలో మాదక ద్రవ్యాలను వాడినట్టు తేలితే నిర్వాహకులపై చర్యలు ఉంటాయన్నారు. నూతన సంవత్సర వేడుకలు సమీపించిన నేపథ్యంలో శుక్రవారం బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హెచ్ న్యూ, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్, సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశాన్ని జరిపారు. అమలు చేయాల్సిన చర్యలపై వారికి దిశా నిర్ధేశం చేశారు.
Also Read: VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!
ఇప్పటికే రంగంలోకి నిఘా బృందాలు
ఈసారి న్యూ ఇయర్ సెల్రబేషన్స్ సందర్భంగా ఎక్కడా డ్రగ్స్ వినియోగం జరగకుండా తీసుకున్న చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచే నిఘా బృందాలను రంగంలోకి దింపినట్టు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. పబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే చోట ఈ బృందాలు కన్నేసి పెట్టినట్టు తెలిపారు. దీంతోపాటు సర్వీస్ అపార్ట్ మెంట్లు, హాస్టళ్లు, ఇండ్లు, అపార్ట్ మెంట్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా పోలీస్ నిఘా ఉంటుందన్నారు. డ్రగ్ ఫ్రీ స్టేట్ లక్ష్యంగా గడిచిన రెండేళ్లుగా పలు చర్యలు తీసుకున్నట్టు కమిషనర్ సజ్జనార్ చెప్పారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో పెడ్లర్లను, వినియోగదారులను అరెస్ట్ చేశామన్నారు. వీరిందరి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టు చెప్పారు. నగరానికి కొత్తగా వస్తున్న వారి వివరాలను కూడా సేకరిస్తున్నామన్నారు. అదే సమయంలో కొరియర్ సంస్థలపై కూడా నిఘా పెట్టామని తెలిపారు.
రాత్రి 1గంటకు
ఇక, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు డిసెంబర్ 31న రాత్రి 1గంటకు వాటిని మూసి వేయాల్సి ఉంటుందన్నారు. ఈవెంట్ల నిర్వాహకులు కూడా కార్యక్రమాలను అదే సమయానికి ముగించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు. అవసరమనుకుంటే నిబంధనలు ఉల్లంఘించే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని చెప్పారు. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్, కేబీఆర్ పార్క్, మైత్రీవనం తదితర ప్రాంతాల్లో చెక్ పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇక, విధుల్లో ఉండే పోలీసులు సమన్వయంతో పని చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు శ్వేత, అపూర్వారావు, రక్షిత కృష్ణమూర్తి, రూపేశ్, చింతమనేని శ్రీనివాస్, గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీలు అందె శ్రీనివాస రావు, మహ్మద్ ఇక్భాల్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.
Also Read: VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

