VC Sajjanar: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ఈవెంట్లకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్వీ.సీ.సజ్జనార్స్పష్టం చేశారు. త్రీ, ఫైవ్ స్టార్ హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు. పర్మిషన్‌లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్ నిర్వహించడానికి పదిహేను రోజుల ముందే దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈవెంట్ మొత్తాన్ని తప్పనిసరిగా సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేయాలని, పార్కింగ్‌ప్రదేశాల్లో కూడా సీసీ కెమెరాలు తప్పనిసరని చెప్పారు. అవసరమైనంత మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని తేల్చి చెప్పారు. ఈవెంట్లు జరిగే చోట ఎలాంటి ఆయుధాలు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా నిర్వహకులదే అని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈవెంట్ నిర్వాహకులదే అన్నారు.
సౌండ్‌పై కఠిన నిబంధనలు
అశ్లీల నృత్యాలను ప్రోత్సహించవద్దని సీపీ ఆదేశించారు. రాత్రి 10 గంటలకు అవుట్‌డోర్ సౌండ్ సిస్టమ్, డీజే సౌండ్ మిక్సర్ వంటి పరికరాలను నిలిపి వేయాలని చెప్పారు. ఇండోర్ (Indoor)లో మాత్రమే రాత్రి 1 గంట వరకు వీటికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఆ సమయంలో కూడా శబ్దం 45 డెసిబుల్స్‌కు మించి ఉండరాదన్నారు. మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి అవకాశం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మద్యం సేవించిన వారి వాహనాలు డ్రైవ్చేసేందుకు అవసరమైనంత మంది డ్రైవర్లను అందుబాటులో పెట్టుకోవాలని కూడా నిర్వాహకులకు సూచించారు.
Also Read: Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

