హీరో రాజ్ తరుణ్- లావణ్య (Raj Tarun – Lavanya)ల కేసు కొన్ని నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో దాదాపు నెలరోజులపాటు వీరి వ్యవహారంపైనే మీడియా ఛానళ్లలో జోరుగా చర్చ సాగింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. ఉన్నట్టుండి మరోసారి బయటకి వచ్చిన లావణ్య పెద్ద బాంబే పేల్చింది. అయితే వీరి కేసులో కీలకంగా వినిపించిన మరో పేరు మస్తాన్ సాయి (Mastan Sai). అతను లావణ్య ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ అంటూ రాజ్ తరుణ్ ఆరోపించాడు.
అయితే, మరోసారి ఆ మస్తాన్ సాయి (Mastan Sai)పై లావణ్య నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ ఇచ్చి అమ్మాయిలపై అత్యాచారం చేసి, వారికి తెలియకుండా వీడియోలు తీసేవాడని ఫిర్యాదులో పేర్కొంది. 300 పైగా న్యూడ్ వీడియోలు ఉన్న మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ ని సైతం పోలీసులకు ఆధారంగా ఇచ్చింది. టాలీవుడ్ కి సంబంధించిన పలువురు నటీమణుల వీడియోలు కూడా ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి టాలీవుడ్ లో ప్రకంపనలు మొదలయ్యాయి.

తాజాగా, బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషా (RJ Shekhar Bhasha) పైనా లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. డ్రగ్స్ కేసులో తనని ఇరికించేందుకు మస్తాన్ సాయితో కలిసి శేఖర్ భాషా కుట్ర పన్నాడని ఆరోపించింది. దీనికి సంబంధించిన ఆధారాలతో సహా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. లావణ్యని డ్రగ్స్ కేసులో ఎలా ఇరికించాలి అనే అంశంపై వారిద్దరూ మాట్లాడుకున్న కాల్ రికార్డ్ ని పోలీసులకు సమర్పించింది. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది.