Fake Job Scam: జిల్లా కేంద్రంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు మాయ లేడీ టోకరా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్. అండ్ బి.సి.ఈ. అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి. నియామక పత్రాలు విడుదల చేయడం పై జిల్లాలో చర్చనీయాంశం గా మారింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ల నియామకం పేరుతో ఒక్కొక్కరి నుంచి 4 నుంచి 5 లక్షలు వసూలు చేసిందని బాధితులకు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా మాయ లేడీ వలకు చిక్కిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నట్లు పోలీసుల అంచనా వేస్తున్నారు.
Also Read: Illegal parking: మేడ్చల్‌లో ట్రాఫిక్ చిక్కులు.. అసలు సమస్య ఏంటంటే?
నమ్మిచ్చి మోసం..
కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అంటూ నిరుద్యోగులకు ఎర వేసింది కిలాడి లేడీ. అంతే కాకుండా నఖిలీ ఆర్. అండ్. బి. ఉద్యోగినంటూ నమ్మించిన కిలేడీ రకంగా స్థాప్స్ వేసి నియామక పాత్రలు చిపించి నమ్మిచ్చి మోసం చేసింది. నియామక పత్రాలు నకిలీ అని తేలడంతో లబోదిబోమంటున్న బాధితులు. ఇల్లాటికే ఈ ఘటనపై సీపీ సాయి చైతన్య దృష్టిలో ఉన్న నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. తాజాగా జిల్లా కలెక్టర్, సివిల్ సప్లై కమిషనర్, ఆర్. అండ్ బి.సి.ఈ. అధికారుల సంతకాలు ఫోర్జరీ నఖిలి పాత్రలు బయట పడ్డాయి. ఇక మరికొంత మంది బాధితులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read: Duvvada Couple: శివాజీ మాటల రచ్చలోకి ‘దువ్వాడ’ జంట.. సపోర్ట్ ఎవరికంటే?

