Anasuya: ‘దండోరా’ (Dhandoraa) ప్రీ రిలీజ్ వేడుకలో తను మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చేందుకు శివాజీ (Sivaji) మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అనసూయపై శివాజీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు తాజాగా అనసూయ (Anasuya) కౌంటర్ ఇచ్చారు. ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చి మరీ శివాజీ కామెంట్స్‌పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ లైవ్‌లో అనసూయ మాట్లాడుతూ.. ‘‘నేను నేర్చుకుంది ఏంటంటే.. అతి వినయం ధూర్త లక్షణం. నాకందరూ ఇంట్లో నేర్చించే వాళ్లు. కోపంతో ముఖంమీదే మాట్లాడేవారితో ఎప్పుడూ భయముండదు. చాలా కామ్‌గా, కంపోజ్డ్‌గా.. అమ్మా, తల్లి, బుజ్జి, నాన్న అని మాట్లాడేవారితో చాలా డేంజర్ అని అనేవారు. అలా ఎలా అనుకునేదానిని. కానీ ఈ రోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. కరక్టే చెప్పారు మన పెద్దవాళ్లు అని. నేను తాజాగా ఒక స్టోర్ లాంచ్‌కు వెళ్లడం జరిగింది. అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగారు. పలానా వ్యక్తి ఇలా అన్నారు.. దానిపై మీ స్పందన ఏంటి? అంటే నా సమాధానం నేను చెప్పాను. ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు, నాకు అనిపించింది నేను చెప్పాను. ఈరోజు మీడియా సమావేశంలో విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ, మాట్లాడటం చూస్తుంటే.. ఒక నార్సిసిస్ట్‌కు ఉండే లక్షణమిదని అనిపించింది.
ఇదంతా చేతగానితనం
నేనుకానీ, చిన్మయి కానీ మాట్లాడుతుంటే.. ఫేక్ ఫెమినిస్ట్‌లు వచ్చేస్తున్నారని అంటారు. అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి. అసలు ఫెమినిజం అంటే ఏంటి? ఆడవాళ్లకు, మగవారికి అన్నివిధాలా సమానమైన హక్కులు ఉండాలనుకోవడం. అసలు ఈ పదమే ఉండకూడదు. ఎందుకంటే ఆడ, మగ ఉంటేనే ఈ ప్రకృతి ముందుకు వెళుతుంది. ఆ సమానత్వం ఉండాలి. ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో.. ఇదంతా చేతగానితనం. సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం, ఇన్‌సెక్యూరిటీ.. అదంతా ఎదుటివాళ్లపై రుద్దుతుంటారు. అది ఈ రోజు జరిగిన సినారియో. ఈ రోజు కూడా ఇంకా సింపతీ గేదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి.. నేను కూడా సింపథిటిక్‌గానే ఉంటాను. ఆయనకు అదే కావాలి కాబట్టి.. అదే ఇస్తున్నాను.
Also Read- Nidhhi Agerwal: శివాజీ కామెంట్స్‌పై నిధి షాకింగ్ పోస్ట్.. మళ్లీ బుక్కయ్యాడుగా!
మా హక్కులు మాకు తెలుసు
నేను ఎందుకు అందులో ఇన్వాల్వ్ అయ్యానని అడుగుతున్నారు. నేను కూడా హీరోయిన్‌నే. నేను కూడా ఫీమేల్ లీడ్ చేశాను. ఆడవాళ్లు ఇక్కడ వరకు బట్టలు వేసుకోవాలని మీరు చెబుతున్నారు. నేను కూడా మీరు ఇక్కడి వరకు వేసుకోవాలని చెబుతున్నానా? ఆ హీరోయిన్స్ అయినా మీతో అంటున్నారా? నేను పర్సనల్‌గా చెబుతున్నాను.. నేను వినిపిస్తున్న వాయిస్‌కు చాలా మంది హీరోయిన్లు నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఆ బలాన్ని నేనెప్పుడూ నెగిటివ్‌గా ఉపయోగించుకోలేదు. మేమందరం బట్టలు వేసుకోవాలని మీరు చెప్పడానికి.. మేమేం చిన్నపిల్లలం కాదు. మా హక్కులు మాకు తెలుసు. మా ఇష్టానుసారంగా జీవించాలని మేము ప్రార్థిస్తున్నాము. మీకు కూడా చాలా వినమ్రతతో చెబుతున్నాను. మీరు నన్ను లాగలేదు. కానీ, కలెక్టివ్‌గా లాగావ్. నేను కూడా ఆడదాన్నే. నేను కూడా గ్లామరస్‌గా, అందంగా ఉండాలని కోరుకునేదాన్నే. నాకు ఇష్టమైనట్లుగా బట్టలు వేసుకోవాలని, చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్‌ల్లా నేను కూడా ఉన్నాను. నా అభిప్రాయం అడిగినప్పుడు నేను చెప్పాను. మీ స్టేట్‌మెంట్‌పై మీరు ఎలా అయితే నిలబడ్డారో.. నేను కూడా నా స్టేట్‌మెంట్‌పై నిలబడుతున్నాను.
Also Read- Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..
సృష్టికర్తలైన మాకెంత బుర్ర ఉండాలి
మీరు అసభ్యకరంగా మాట్లాడి, సారీ అని చెప్పి మరిచిపోతారు. మీరే చాలా తెలివిగలవారని అనుకుంటే.. సృష్టికర్తలైన మాకు ఇంకెంత బుర్ర ఉంటుందని అనుకుంటున్నారు. మేమందరం కలిస్తే, మీకు కూడా మీ ప్లేస్ చూపించాలని కంకణం కట్టుకుంటే వేరేలా ఉంటుంది. సినిమాల్లో యాక్ట్ చేయండి. మొన్న ఈవెంట్‌లో మీరు మాట్లాడిన టోన్ ఏదైతే ఉందో.. అది మీ అసలు స్వరూపం. నిజంగా మీకు దయ, కరుణ ఉంటే.. ఆడవాళ్లకు కాదు.. మగవాళ్లకు చెప్పండి. ‘ఓరేయ్ ఏంట్రా అది.. అడవి జంతువుల్లా ఉండటం. ఆ అమ్మాయి అంత అందంగా ఉంది. చూడండి, ఆమెను గౌరవించండి. హద్దులు దాటకండి’ అని నేర్పించండి. బట్టలు ఇలా వేసుకోవాలి, అలా వేసుకోవాలి అని ఎక్కడైనా రాసి ఉందా? బట్టలు అనేది మ్యాటర్ కాదు.. క్యారెక్టర్, బిహేవియర్ ముఖ్యం. రుణం అంటూ ఏదో మాట్లాడారు. నాకు మీ సపోర్ట్ అవసరం లేదు. ఇలాంటివి చాలా దాటుకుని వచ్చాను. నా చుట్టూ నన్ను క్షేమంగా, హాయిగా చూసుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. మీరు అక్కరలేదు. మీలాంటి వాళ్లు అస్సలు అక్కరలేదు. ప్లీజ్ నాకు దూరంగా ఉండండి..’’ అని అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

