Nidhhi Agerwal: ‘దండోరా’ (Dhandoraa) ప్రీ రిలీజ్ వేడుకలో నటుడు శివాజీ (Actor Sivaji) మాట్లాడిన మాటలు ఎలాంటి వివాదానికి దారి తీశాయో తెలియంది కాదు. దీనిపై పెద్ద రచ్చే జరుగుతుంది. చిన్మయి మొదలుకుని, అనసూయ, నందినీ రెడ్డి, సుప్రియ వంటి వారంతా ఆ మాటలపై ధ్వజమెత్తుతున్నారు. చిత్ర పరిశ్రమలోని 100 మందికి పైగా మహిళా నిపుణుల తరపున నందినీ రెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, మంచు లక్ష్మి, ఝాన్సీ వంటి ప్రముఖులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడికి ఒక ఘాటైన లేఖ కూడా రాశారు. మహిళా కమిషన్ కూడా శివాజీకి నోటీసులు పంపించింది. ఇలా, ఈ ఇష్యూ పెద్దదిగా మారుతున్న క్రమంలో శివాజీ క్షమాపణలు చెబుతూ, ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోతో సరిపెట్టుకోకుండా, బుధవారం మీడియా సమావేశం నిర్వహించి మరీ క్షమాపణలు కోరుతూ, మరింత వివరణ ఇచ్చారు. ఈ వివరణలో ఎక్కువగా నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) పేరును ఆయన హైలెట్ చేశారు.
Also Read- Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..
నిధి అగర్వాల్ డ్రస్సు జారితే
మీడియా మీట్‌లో శివాజీ మాట్లాడుతూ.. ‘‘నేను అలా మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే.. ఓ మాల్‌లో రీసెంట్‌గా నిధి అగర్వాల్ పడ్డ వేదన, తను కారులో కూర్చున్న తర్వాత ఎంత ఎంబ్రాసింగ్‌గా ఫీలైందో.. అది నా మైండ్‌లో నుంచి పోలేదు. ఆ వెంటనే సమంతపై కూడా. నిధి అగర్వాల్ పాడిన ఇబ్బంది చూసి, నా మైండ్ అలా ఉండిపోయింది. కోతి నుంచి మనిషిగా మారిన తర్వాత కొన్ని శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే అని దుస్తులు కప్పుకోవడం, ఆ తర్వాత కట్టుకోవడం నేర్చుకున్నారు. కాదు మళ్లీ ఆ సిస్టమ్‌కే పోతాం అంటే మీ ఇష్టం. సినిమాల వల్లనే ఈ సమాజం చెడిపోతుందని పదే పదే వింటూ ఉన్నాను. అందుకే నాలుగు మంచి మాటలు చెబుదామని అనుకున్నాను. అందులో రెండు అసభ్యకర పదాలు దొర్లాయి. ఆ పదాలకు ఎక్కడైనా, ఎప్పుడైనా సారీ చెబుతాను. ఒక వేళ అదే వేడుకలో నిధి అగర్వాల్ డ్రస్సు జారి.. ఏదైనా జరిగి ఉంటే, కెమెరాలలో పదే పదే అదే చూపించేవారు. అలా జరిగి ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాపై ఇంత చేస్తున్న వారంతా, ఆ అమ్మాయికి సపోర్ట్‌గా నిలబడతారా?’’ అంటూ శివాజీ ప్రశ్నించారు.
Also Read- Sree Vishnu: టాలెంట్ ఉన్న కొత్తవాళ్లు నన్ను కలవండి.. అతని నెంబర్ ఇస్తా!
బాధితురాలినే నిందిస్తున్నారు
ఇలా శివాజీ, తన వ్యాఖ్యలకు కారణం నిధి అగర్వాల్ డ్రస్సే అని పదే పదే చెబుతుండటం, తాజా వివరణలో ఆయన డ్రస్సు జారిపోతే అనే వ్యాఖ్యలు చేయడం పట్ల.. సోషల్ మీడియా వేదికగా నిధి అగర్వాల్ రియాక్టైంది. మరోసారి శివాజీని ఇరుకున పడేసేలా ఆమె పోస్ట్ ఉందంటే.. ఆయన మాటలకు ఆమె ఎంతగా హర్ట్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ‘‘బాధితురాలినే నిందిస్తూ సానుభూతి పొందుతున్నారు’’ అంటూ తన ఇన్‌స్టా స్టాటస్‌లో పోస్ట్ చేసింది. ఇది శివాజీపై మరింత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే, ఇబ్బంది పడిన నిధి అగర్వాల్, ఆ గాయాన్ని మరిచిపోయేందుకు ప్రయత్నిస్తుంటే, శివాజీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పదే పదే అదే ఘటనని గుర్తు చేయడం నిజంగా ఆమెకు బాధని కలిగించే విషయమే. దీనిపై కూడా శివాజీ దృష్టి పెడితే బాగుంటుంది అని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

