Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. స్టేట్‌మెంట్‌కు కాదు
Anasuya and Sivaji (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

Sivaji: ‘దండోరా’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన మాటలకుగానూ శివాజీ (Sivaji) మరోసారి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘మొన్న జరిగిన ‘దండోరా’ ప్రీ రిలీజ్ వేడుక (Dhandoraa Pre Release Event)లో నేను మాట్లాడే సమయంలో రెండు అసభ్యకర పదాలు నా నోటి నుంచి వచ్చాయి. అందుకు నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నాను. ఆల్రెడీ చెప్పాను. మరీ ముఖ్యంగా ఈ క్షమాపణలు నేను చెప్పాలనుకుంటున్న వ్యక్తులు ఎవరంటే, ఆ రోజు ఆ స్టేజ్‌పై ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు.. ఆ పదాలు మాట్లాడినందుకు సారీ. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి పదాలు దొర్లలేదు. 30 సంవత్సరాల జర్నీలో ఎప్పుడూ లేదు. అన్ని సంవత్సరాలు పాలిటిక్స్‌లో ఉన్నా, ఏ రోజూ కూడా జగన్‌ను కానీ, మహిళలను కానీ, లేదంటే ఏ పార్టీనికానీ.. నా హద్దు దాటి మాట్లాడలేదు. అలాంటిది ఆ స్టేజ్‌పై ఎలా అలా మాట్లాడానో.. అని చాలా బాధపడ్డాను. అందుకే ఆ రెండు పదాలు అన్నందుకు సీన్సియర్‌గా సారీ చెబుతున్నాను.

నా కర్మ అలా కాలింది

నేను ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు మాత్రం కట్టుబడే ఉన్నాను. దాంట్లో ఎవరికీ భయపడేది లేదు. నేను వాడిన ఆ రెండు పదాలకు మాత్రం చింతిస్తున్నాను. అలా మాట్లాడటం తప్పు.. అందుకే క్షమాపణలు కోరుతున్నాను. ఇక విషయానికి వస్తే.. మన సంస్కృతి పట్ల, సమాజం పట్ల, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి గంగాధర శాస్త్రి, చాగంటి, గరికపాటి వారి ప్రవచనాలలో చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా వారు చాలా సూచనలు చేశారు. సినిమాలలో ఎలా అయినా ఉండండి, కానీ బయట అలా వద్దు అని పదే పదే చెబుతున్నారు. నేను అలా మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే.. ఓ మాల్‌లో రీసెంట్‌గా నిధి అగర్వాల్ పడ్డ వేదన, తను కారులో కూర్చున్న తర్వాత ఎంత ఎంబ్రాసింగ్‌గా ఫీలైందో.. అది నా మైండ్‌లో నుంచి పోలేదు. ఆ వెంటనే సమంతపై కూడా. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 90 శాతం ఫీమేల్ ఆర్టిస్ట్‌లు.. రమ్యకృష్ణ, జయసుధ, విజయశాంతి వంటి వారు ధరించిన శారీలను, ఆ పేరుతో షాపుల్లో అమ్మేశారు. నేను ఎవ్వరినీ ఆ డ్రసులు వేసుకోండి, మీరు కప్పేసుకోండి అని చెప్పడం లేదు. నేనెవరిని చెప్పడానికి. సమాజంలో ఏ రుగ్మత వచ్చినా కానీ, సమాజం సినిమా వల్ల చెడిపోతుంది. మీరు వేసుకునే డ్రస్సులు వల్ల చెడిపోతుంది. సినిమా వల్లనే ఈ సమాజం చెడిపోతుందనే మాటలు తరుచూ వింటున్నాను కాబట్టి.. ఈ సినిమాపై బతికే నేను.. ఎందుకు వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే నేను అలా మాట్లాడాను. అసలు అలా ఎలా మాట్లాడానో ఇంతవరకు నాకే అర్థం కావడం లేదు. ఆ స్పీచ్ అయిన తర్వాత.. ఫస్ట్ నా భార్యకే సారీ చెప్పాను. నా కర్మ అలా కాలింది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.

Also Read- Sree Vishnu: టాలెంట్ ఉన్న కొత్తవాళ్లు నన్ను కలవండి.. అతని నెంబర్ ఇస్తా!

ఒక్కమాట నన్ను అడిగి ఉంటే

నేను అలా అన్న కాసేపటికే.. సోషల్ మీడియాలో చిన్నయికి, అనసూయకు ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు మొదలయ్యాయి. ఇండస్ట్రీలో నన్ను అన్నయ్య అని పిలిచే వారు రిపోర్ట్స్ రెడీ చేసి ‘మా’కు, ఇంకా ఇతర సంస్థలకు పంపించారు. ఒక్కమాట నన్ను అడిగి ఉంటే, వెంటనే సారీ చెప్పేవాడిని. సుప్రియ ఫోన్ చేశారు. అప్పుడే చెప్పాను. తప్పు జరిగిపోయింది, సారీ చెప్పాను అని ఆమెతో కూడా చెప్పాను. ఒక్కమాట నన్ను అడిగి ఉంటే, ఇంత రాద్ధాంతం అయ్యేది కాదు. నేనేం మిస్‌బిహేవ్ చేయలేదు. భూమిక, లయ, సంఘవి వంటి స్టార్ నటీమణులతో నటించాను. ఏ రోజూ, ఎవరితో అసభ్యకరంగా ప్రవర్తించలేదు. ప్రవర్తించను కూడా. ఎందుకంటే, ఏది ఎలా మెడకు చుట్టుకుంటుందో ఎవరికి తెలుసు? ఇదే విషయాన్ని ఇక సెలబ్రిటీలందరినీ అడుగుతుంటారు. ఇంకో పెద్ద ఇష్యూ వచ్చే వరకు ఇది వార్తలలో ఉంటూనే ఉంటుంది.

Also Read- Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

మంచి మాటలే చెప్పా

నిధి అగర్వాల్ పడిన ఇబ్బంది చూసి, నా మైండ్‌ అలా ఉండిపోయింది. ఈ ఇష్యూని మహిళా కమిషన్ వరకు తీసుకెళ్లారు. నాకంటే ముందు పెద్ద పెద్ద మాటలు ఎవరూ మాట్లాడలేదా? నన్నే ఎందుకు అంతగా టార్గెట్ చేశారు? అమరావతి రైతుల మీద బూటు కాలు వేసి తొక్కినప్పుడు నేను మాట్లాడా.. నేను నిలబడ్డా. జెన్ జీ కోసం ఎంతో మంది నాయకులతో పోరాడా. అలాంటి ఈ వివాదం అటు, ఇటు తిరిగి మహిళా కమిషన్ వరకు వెళ్లింది. వాళ్లు ఫోన్ చేసి 27వ తేదీ మీరు రావాలని అన్నారు. నేను సారీ చెప్పాను అని చెప్పినా, నోటీసు ఇచ్చిన తర్వాత రావాలని అన్నారు. కచ్చితంగా వెళతాను. వారి దగ్గరకు వెళ్లి ఒక ఆపాలజీ లెటర్ ఇస్తా. దీనికి నేనేం సిగ్గుపడను. నేను తప్పు చేసినప్పుడు క్షమాపణలు చెప్పడానికి సిగ్గు పడాల్సింది ఏముంది. ఏమీ తప్పులేదు. నేను మంచి మాటలే చెప్పాను. నా దృష్టిలో నిధి అగర్వాల్ ఇన్సిడెంటే ఉంది. నాపై ఇంత చేసిన వాళ్లు ఎవరూ ఆ అమ్మాయికి సపోర్ట్‌గా రాలేదు. ఇందులో అనసూయ ఎందుకు వచ్చారో నాకు తెలియదు. అనసూయ నా ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు. నా మీద జాలి చూపించారు. చాలా సంతోషం, త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. నాకంటే ముందు పెద్దవాళ్లు కొందరు చాలా మాట్లాడారు. అప్పుడు ఎవరు ఏం మాట్లాడలేదే? నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడాను. నా మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేదు’’ అని వివరణ ఇచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

AP Govt: సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

AV Ranganath: పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి.. అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా మారిన పెన్ డ్రైవ్.. ఆధారాలతో ప్రభాకర్ రావుపై సిట్ ప్రశ్నల వర్షం!

Vivek Venkatswamy: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మంత్రి వివేక్ వెంకటస్వామి!

Anasuya: అతనిది చేతగానితనం.. శివాజీకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్