UP Man: యూపీలో సంచలనం.. కుక్కలా మారిన యువకుడు
UP Man (Image Source: Twitter)
Viral News

UP Man: యూపీలో సంచలనం.. కుక్కలా మారిన యువకుడు.. కనిపించిన వారిపై దాడి

UP Man: కుక్క కాటు ఎంత ప్రమాదకరమైందో అందరికీ తెలిసిందే. కుక్క కాటుకు గురైన వ్యక్తి నిర్లక్ష్యం వహిస్తే నెల నుంచి 3 నెలల వ్యవధిలో ర్యాబిస్ వ్యాధి బారిన పడొచ్చని వైద్యులు చెబుతుంటారు. అలాంటిది యూపీలో ఓ యువకుడు.. కుక్క కరిచిన మూడ్రోజుల వ్యవధిలోనే రాబిస్ వ్యాధి బారిన పడ్డాడు. తీవ్రమైన లక్షణాలతో కనిపించిన వారిపై దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అతడ్ని బంధించి.. మంచానికి కట్టేశారు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అలీగఢ్‌ జిల్లా (Aligarh District)కు చెందిన 23 ఏళ్ల యువకుడు.. డిసెంబర్ 20న కుక్కకాటుకు గురయ్యాడు. ఖైర్ తహసీల్ లోని ఉత్వారా గ్రామానికి చెందిన రామ్ కుమార్ అలియాస్ రాము అనే యువకుడ్ని పిచ్చికుక్క కరిచింది. కాటు చిన్నగానే ఉండటంతో ఇంట్లోనే వైద్యం చేశారు. అయితే మరుసటి రోజుకే అతడి ఆరోగ్యం క్షీణించింది. దూకుడుగా ప్రవర్తించడం, చుట్టుపక్కల వారిని కరిచేందుకు యత్నించడం చేశాడు. కుక్కలా మెురుగుతూ తోటి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో అతడు రేబిస్ వ్యాధి బారిన పడినట్లు స్థానికులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే అతడిలో తీవ్రమైన లక్షణాలు బయటపడటం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

వైద్యులు సైతం షాక్..!

అయితే రాము నుంచి ఇతరులకు హానీ కలగకూడదన్న ఉద్దేశ్యంతో కుటుంబ సభ్యులు అతడ్ని మంచానికి కట్టేశారు. ఇంటి నుంచి ఖైర్ కమ్యూనిటీ సెంటర్ కు హుటాహుటీనా తరలించారు. రేబిస్ లక్షణాలు మరి ఎక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రాముని దిల్లీ ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్క కరిచిన గంటల వ్యవధిలో అతడు ఇలా తీవ్ర అస్వస్థతకు గురికావడం చూసి వైద్యులు సైతం షాక్ కు గురైనట్లు తెలుస్తోంది. యూపీలో రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్క కాటు ఘటనల పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Bengaluru: ఎఫైర్ పెట్టుకోలేదని.. ఇన్‌స్టా ఫ్రెండ్ దారుణం.. యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి..!

రేబిస్ ఎందుకంత ప్రమాదకరం!

కాగా, మనుషులకు సోకే అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో రేబిస్ ఒకటి. ఇది కుక్కలతో పాటు గబ్బిలాల వంటి జంతువుల ద్వారా కూడా మనుషులకు వ్యాపిస్తుంటుంది. రేబిస్ అనేది ఒక ప్రమాదకరమైన వైరస్. ఇది మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వెన్నుపామును సైతం దెబ్బతీస్తుంది. రేబిస్ నుంచి బయటపడాలంటే కుక్కకాటు జరిగిన వెంటనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. రాబిస్ లక్షణాలు బయటపడ్డ తర్వాత దీని నుంచి బయటపడటం దాదాపు అసాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ముందస్తు వ్యాక్సినేషన్, తక్షణ వైద్యం ద్వారానే రేబిస్ నుంచి బయటపడవచ్చని స్పష్టం చేస్తున్నారు.

Also Read: Deputy CM Pawan Kalyan: పవన్ పర్యటన నేపథ్యంలో వివాదం.. కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు

Just In

01

Additional Collector Anil Kumar: వినియోగ దారులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : జిల్లా రెవెన్యు అదనపు కలెక్టర్ అనిల్ కుమార్!

Cyber Fraud: ఓరి దేవుడా.. డిజిటల్ అరెస్ట్ పేరిట.. రూ.9 కోట్లు దోచేశారు

Sivaji: ఆ రెండు అసభ్యకర పదాలకే సారీ.. మిగతా స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నా..

MLA Kadiyam Srihari: క‌డియంకు స‌వాల్‌గా మారిన ఎమ్మెల్యే ప‌ద‌వి.. నిర‌స‌న‌ల‌తో హోరెత్తిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు!

IndiGo Crisis: ఇండిగో సంక్షోభం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రెండు కొత్త ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్