Bengaluru: బెంగళూరు మహానగరంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి అమానుషంగా దాడికి తెగబట్టాడు. తనతో అక్రమ సంబంధం పెట్టుకోలేదని ఆరోపిస్తూ ముఖంపై పలుమార్లు కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె జట్టు పట్టుకొని నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. స్థానికులు ఇదంతా గమనించినప్పటికీ ఒక్కరూ కూడా నిందితుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాగా దాడికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో రికార్డు కాగా.. అవి కాస్త వైరల్ గా మారాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే?
యువతిపై దాడి.. డిసెంబర్ 22 మధ్యాహ్నం ప్రాంతంలో జరిగింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. మ. 3.20 గం.ల ప్రాంతంలో ఓ యువతి స్కూటీ పక్కన ఫ్రెండ్ తో నిలబడి ఉంది. ఆ సమయంలో అక్కడికి కారులో వచ్చిన నిందితుడు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె హ్యాండ్ బ్యాగ్ ను తీసుకొని తొలుత పరిశీలించాడు. అనంతరం తల, వెనుక భాగంపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా జుట్టుపట్టుకొని కొద్దిదూరం లాకెళ్లాడు. ఆ సమయంలో స్కూటీపై ఇద్దరు, పాదచారులు అటుగా వెళ్తున్నప్పటికీ నిందితుడ్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బాధితురాలిని కాపాడేందుకు ముందుకు రాలేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం
కాగా దాడి ఘటనపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. యువతిపై దాడి చేసిన వ్యక్తిని నవీన్ గా పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ రిపోర్టు ప్రకారం.. బాధిత యువతికి 2024లో నవీన్ పరిచయం అయ్యారు. వారి మధ్య కొంతకాలం పాటు ఫోన్ కాల్స్ మెసేజ్ లు కొనసాగాయి. అయితే కాలక్రమేణా తనపై సంబంధం పెట్టుకోవాలని బాధితురాలిపై నవీన్ ఒత్తిడి తెచ్చినట్లు తలుస్తోంది. ఇందుకు బాధితురాలు ససేమీరా అనడంతో ఆమెపై నవీన్ కోపం కట్టలు తెంచుకుంది.
Also Read: Deputy CM Pawan Kalyan: పవన్ పర్యటన నేపథ్యంలో వివాదం.. కుర్చీలతో కొట్టుకున్న జనసేన నేతలు
నిందితుడు అరెస్టు
ఈ క్రమంలో డిసెంబర్ 22న కారులో ఆమె ఉంటున్న హాస్టల్ వద్దకు నవీన్ వచ్చాడు. బయట ఫ్రెండ్ తో నిలబడి ఉన్న ఆమెపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లాడు. ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే దాడికి పాల్పడిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సోషల్ మీడియా ఏర్పడిన పరిచయాల పట్ల మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
🔴#BREAKING | On camera: Man slaps woman incessantly in broad daylight in Bengaluru as passersby watch
NDTV's @reethu_journo joins @ParmeshwarBawa with more details pic.twitter.com/jRWU8mMIZo
— NDTV (@ndtv) December 24, 2025

